అధిక వర్షాలు పడ్డప్పుడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద నీరు నదుల్లోకి చేరి నదులు ఉప్పొంగడం సర్వసాధారణం. అలాగే కృష్ణా, గోదావరి నదులు తరచూ ఉప్పొంగుతుంటాయి. ఈ నదులు ఉప్పొంగే పరిస్థితిని కొంత ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది. అయితే పెన్నా నది విషయంలో మాత్రం కాదు. ఈ నది రూటే సపరేటు. రాత్రికి రాత్రే ఉప్పొంగడం దీని ప్రత్యేకత. ఇలాంటి సంఘటన ఇటీవలే జరిగి మరోసారి తెరపైకి వచ్చింది.
కర్ణాటకలో ప్రారంభమయ్యే పెన్నా, చిత్రావతి నదుల రూటే సపరేట్. ఎప్పడూ పారని ఈ నదులు గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఒక్కసారిగా వరదలు వచ్చి తమ విశ్వరూపాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెన్నా అయితే కడప నుంచి నెల్లూరు వరకు రాత్రికి రాత్రే పరవళ్ళు తొక్కుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం పెన్నాపరివాహక ప్రాంతమంతా కురిసిన భారీవర్షాలకు పైనున్న ప్రాజెక్ట్ లన్నీ నిండిపోయి ప్రవహిస్తుంది. 20 ఏళ్ళుగా నిండని పేరూరు ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండిపోయి ప్రాజెక్ట్‌ల గేట్లుఎత్తి దిగువకు వదిలారు. కడప ప్రాంతంలో వర్షాలు పడితేనే ఉప్పొంగే పెన్నా.. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరదలు వస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేనంత ఉద్ధృతంగా పెన్నా నది తన ఉగ్రరూపం చూపించింది. జవాద్ తుఫాను మూలంగా గత 20 ఏళ్ల నుంచి నిండని చెరువులు , డ్యాంలు పొంగిపొరలాయి. పెన్నా నది ఉగ్రరూపం వెనక అసలు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. రాత్రికి రాత్రే ఉదృతంగా ప్రవహించడం వెనుక జవాద్ తుఫాన్ వేళ పెన్నా పరివాహక ప్రాంతంలో ఏకంగా 130 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. జవాద్ తుఫానుకు ముందు అక్కడక్కడా అకాల వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు రావడంతో ఆ వరద నీరు వాగులు వంకల ద్వారా చెరువు లోకి వచ్చి చేరింది.
Also Read: ఆ 60 మందివి ప్రభుత్వ హత్యలే, ఆ ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం.. చంద్రబాబు వ్యాఖ్యలు
ఉప్పొంగడానికి కారణం ఏంటంటే..
దీనికితోడు తుఫాన్ తాకిడి ఒక్కసారిగా పెరగడంతో పేరూరు, యోగివేమన లాంటి డ్యాములు నిండిపోయి గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి .ఈ సర్ ప్లస్ నీళ్లు పెన్నాకు చేరడంతో తీవ్ర రూపం దాల్చింది. రాత్రికి రాత్రే ఏకంగా 130 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పెన్నానది ఉప్పొంగడానికి మొదటి ప్రధాన కారణంగా నీటిపారుదల శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెన్నా నది ఉద్ధృత ప్రవాహం ధాటికి రహదారులు, వంతెనలు, పంటపొలాలు, పశు సంపద , ప్రాణ నష్టం సంభవించేలా చేసింది. కృష్ణా గోదావరి ఉదృతంగా ప్రవహించే స్థాయిని ముందుగానే అంచనా కట్టవచ్చు. పెన్నాతో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాత్రికిరాత్రే ప్రవాహ ఉధృతిని పెంచడం తద్వారా ఊళ్లను ముంచెత్తే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
చిత్రావతి నది పరిస్థితి పెన్నాతో పొలిస్తే కాస్త వేరు. పెన్నా మాదిరి ఉన్నట్లుండి వరదలు రావు. కేవలం కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితేనే కిందకు వదలుతారు. కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా మాత్రం చిత్రావతి కూడా వర్షాల నేపథ్యంలో నిండుగా ప్రవహిస్తూ నదీ పరివాహక ప్రాంతం కూడా పచ్చగా ఉంటుంది. దీంతో రాయలసీమలో కీలకమైన నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.
Also Read: నిమిషాల్లో విరుచుకుపడిన ప్రళయం ! పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల విలయం ఎలా జరిగిందంటే ?
Also Read : చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన..
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ