చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. తిరుపతి రాయలచెరువును చంద్రబాబు పరిశీలించారు. ఈ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు రాయల చెరువు పరిశీలించి తిరిగి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురయ్యారు. రాయలచెరువు వద్ద గండి పడిన ప్రాంతంలో నివారణ చర్యలను చెవిరెడ్డి పరిశీలించారు. చంద్రబాబును చూసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేచి నిలబడి నమస్కరించారు. వాహనంలో నుంచి చెవిరెడ్డికి చంద్రబాబు తిరిగి నమస్కరించారు.



రాయలచెరువు వద్ద ఆసక్తికర సన్నివేశం


చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు  తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టను పరిశీలించారు. కట్ట లీకేజీలను వెంటనే పూడ్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని చంద్రబాబు సూచించారు. రాయల చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను చంద్రబాబు పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని కోరారు. చంద్రబాబు పర్యటన సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వచ్చారు. ఆయన చంద్రబాబుకు లేచి నమస్కారం చేశారు. వాహనంలో ఉన్న చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు. ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.


Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !


రాయలచెరువు రెడ్ జోన్


తిరుపతి గ్రామీణ ప్రాంతాన్ని రాయల చెరువు భయపెడుతోంది. కట్ట నుంచి లీకేజీ రావడంతో ఎప్పుడు గండి పడుతుందని భయాందోళలనకు గురవుతున్నారు. రాయల చెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలుత పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. రాయలచెరువును రెడ్ జోన్‌గా గుర్తించినట్లు తెలిపారు. చెరువు లీకేజీలకు మరమ్మతులు జరుగుతున్నాయని చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చేందుకు ఇబ్బంది అవుతుందని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు భద్రత కల్పించలేమని డీఎస్పీ తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు రాయలచెరువుకు చేరుకుని పరిశీలించారు. 


Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !


మరో ఆసక్తికర ఘటన


చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. వరద ప్రభావానికి గురైన గాయత్రి నగర్ ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుకు బాల్య మిత్రుడు కనిపించారు. బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు ఇంటికి వెళ్లిన చంద్రబాబు చిన్నినాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 


Also Read:  పెద్ద హీరోల సినిమాలకు కోలుకోలేని దెబ్బ ! టాలీవుడ్ కింకర్తవ్యం ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి