భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లను అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు. వరద నష్టం అంచనాలకు తక్షణం కేంద్ర బృందాలను పంపాలని జగన్ కోరారు. వానలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని లేఖలో సీఎం జగన్ మోడీ, షాలకు వివరించారు. నాలుగు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదయిందని.. 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షం పడిందన్నారు. వరదల కారణంగా అపార నష్టం జరిగిందని.. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..
నాలుగు జిల్లాల్లో చెరువులు సహా మౌలిక వసతులన్నీ ధ్వంసం అయ్యాయని లేఖలో జగన్ గుర్తు చేశారు. 196 మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం జగన్ ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. చెరువులకు గండ్లు పడటం వల్ల ఎక్కువ ప్రాంతాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా విస్తృత చర్యలు తీసుకున్నామని 324 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తక్షణం వరద సాయం అందించాలని లేఖల్లో జగన్ కోరారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వచ్చిన వరద సృష్టించిన బీభత్సం దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వచ్చాయి.
Also Read: Tomato Price Today: పెట్రోల్ రేట్లను దాటేసిన టమోటా.. కొన్నిచోట్ల రూ.140, సడెన్‌గా పెరుగుదల ఎందుకు?
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. సీఎం జగన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. అవసరమైన సాయం అందిస్తామని ప్రజలను కాపాడాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నేవీ హెలికాఫ్టర్లను కూడా పంపింది. వీటి వల్ల పలువురి ప్రాణాలను కాపాడారు. అయితే కేంద్రం ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి సాయం చేయలేదు. రూ. కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లడం, రహదారులు, చెరువులు, విద్యుత్ వంటివి భారీగా ధ్వంసం కావడంతో వాటికి మరమ్మతులు చేయడానికే పెద్ద ఎత్తున ఖర్చవుతాయి.
Also Read : ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు
దీంతో సీఎం జగన్ ప్రధాని మోడీ, అమిత్ షాలకు సాయం కోసం లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం సాయం చేస్తుంది. ఈ సారి అలాంటి సూచనలు లేకపోవడంతో సీఎం స్వయంగా లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు.
Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !