వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు భరోసానిచ్చేందుకు కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. మనుషుల వైఫల్యం వల్లే ఇలాంటి నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తుపాను వస్తుందని ముందే తెలుస్తుందని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ఇలాంటి పరిణామం జరిగిందని విమర్శించారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతుంది అని ఎవరూ చెప్పలేదని.. ప్రాజెక్టు గేట్లు మైంటైన్ చేయాలని సూచించారు. గత ఏడాది పించా, అన్నమయ్య డ్యామ్ ల వల్ల ఇబ్బంది పడ్డారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అధికారులను అప్రమత్తం చేశామని గుర్తు చేశారు.  


'వర్షాలు ఆపలేం కానీ తుపాను తీవ్రతను గుర్తించగలం. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ప్రతి గ్రామానికి తిరిగిన జగన్...ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు. అసెంబ్లీ లో నా సతీమణి ని అగౌరపరిచేలా వైసీపీ నాయకులు మాట్లాడారు. ప్రజల కోసం పోరాడుతున్నాను. అసెంబ్లీ లో చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు. శాసనసభ కాదు కౌరవ సభ. ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఏరియల్ సర్వే చేసిన జగన్ నేరుగా పెళ్లికి వెళ్లి బిర్యానీ తిన్నాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. విందులకు వెళ్లాడు. పోలీసులకు అదిరేది బెదిరేది లేదు. ఇసుక ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు వైసీపీ నాయకులు. వెయ్యి ఇల్లు కష్టాల్లో ఉంటే ఆదుకోలేని సీఎం.. సీఎం విలాసవంతమైన జీవనము సాగిస్తున్నాడు. సామాన్య ప్రజల కష్టాలు జగన్ కు పట్టడం లేదు.' అని చంద్రబాబు అన్నారు.


మానవత్వం తో ఇక్కడికి వచ్చాను. వరద బాధితులకు అండగా ఉంటాము. ప్రతిపక్షం లో ఉన్నా.. చనిపోయిన బాధితులకు ఒక్క లక్ష రూపాయలు, బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు పార్టీ తరఫున ఇస్తాం. రాత్రి పడుకుని ఉంటే గ్రామాలు శ్మశానాన్ని తలపించేవి. గ్రామాలకు ప్రొటెక్షన్ వాల్ కట్టించాలని ప్రజలు అడిగారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించక పోతే మేం అధికారంలోకి వచ్చాక చేయిస్తాం. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇచ్చిన జగన్.. ఇక్కడ ఎందుకు 5 లక్షలు మాత్రమే ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తాం న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విజిలెన్స్, సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నాం.
                                                                                                          - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవాళ కడప జిల్లాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత.. బుధవారం చిత్తూరు, గురువారం నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 


Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !


Also Read: MP Raghurama: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష