ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానుల విషయంలో కీలకమైన సూచనలు చేశారు రాజ్యసభ ఎంపీ , రాయలసీమ హక్కుల పోరాట నేత టీజీ వెంకటేష్. తన సూచనలు అంగీకారమైతే తాను బీజేపీని ఒప్పిస్తానని ఆయన జగన్‌కు ఆఫర్ ఇచ్చారు. అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని.. తర్వాత కూడా ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉందన్నారు.  తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. 


Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష


 ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని టీజీ వెంకటేష్ ఆరోపించారు.  అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని టీజీ వెంకటేష్ సూచించారు.  తన నేతృత్వంలోని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి ఇదే  డిమాండ్ చేస్తోందన్నారు.    కర్నూలులో హైకోర్టు బెంచ్ ను వెంటనే ఏర్పాటు చేయాలని..  తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలన్నారు.  లేకపోతే రెండూ పోతాయని టీజీ హెచ్చరించారు. 


Also Read: YSRCP Kadapa : పంచాయతీ నిధులు తీసేసుకున్న ఏపీ ప్రభుత్వం.. కడప జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్‌ల రాజీనామా





విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని, కాబట్టి కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.  అమరావతి కోసం రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలన్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం  మళ్లీ చట్టం చేస్తే కోర్టుకు వెళతారని దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు.  అమరావతినే క్యాపిటల్‌గా ఉంచాలి. పేరు ఏదైనా పెట్టుకొండి.. కానీ అభివృద్ధి మాత్రం చేయండి. ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదు. రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని పరిష్కారం చూపించారు. 



Also Read: Mudragada : మీ పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోలేదు.. చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ !






 ముఖ్యమంత్రి జగన్ నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ వెంకటేష్ స్పషఅటంచేశఆరు.  రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందన్నారు. టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన టీజీ తర్వాత బీజేపీలో చేరారు. చాలా కాలంగా రాయలసీమ హక్కుల కోసం గళం వినిపిస్తూ ఉన్నారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి