ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులన్నింటీనీ పైసా ఉంచకుండా తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు కూడా అవకాశం లేకుండా ..., మొత్తం అనుమతి లేకుండా తీసేసుకోవడంతో సర్పంచ్‌లు హతాశులయ్యారు. సోమవారమే విషయం తెలియడంతో పలువురు సర్పంచ్‌లు ఆందోళన బాట పట్టారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన పదమూడు మంది సర్పంచ్‌లు మూకుమ్మడిగా రాజీనామా చేశఆరు. ఎనిమిది నెలలుగా గ్రామాల్లో మోటార్ రిపేర్ చేయించిన బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌లు గా ప్రమాణం చేసినప్పటి నుంటి ఎలాంటి అభివృద్ది చేయలేకపోతున్నామని.. అందుకే ఆవేదనతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు
Also Read: మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !
ఏపీ గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా రూ.965 కోట్లకు పైగా జమయ్యాయి. పలు పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులు తగ్గిపోగా, ఇంకొన్నింటిలో 'జీరో' చూపిస్తున్నట్లు సర్పంచులు గుర్తించారు. ఎన్ని పంచాయతీల నుంచి నిధులు వెనక్కి తీశారు? ఈ మొత్తం ఎంత? ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు? అన్న ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల వద్దా జవాబు లేదు. విద్యుత్తు బకాయిల కింద 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో దాదాపు 345 కోట్లు వెనక్కితీసి విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించారు. ఇప్పుడు దేనికి తీసుకున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
Also Read: మీ పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోలేదు.. చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ !
స్థానిక సంస్థల నిధులను ఖాళీ చేసి ప్రభుత్వం .. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని టీడీపీ మండిపడింది. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని నారా లోకేష్ ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలని డిమాండ్ చేశారు.
వ్యవస్థల విధ్వంసానికి @ysjagan బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు.రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా..(1/3) pic.twitter.com/JbfD3Wh0Xh
Also Read: మళ్లీ 3 రాజధానులా? అసలు జీతాలకు డబ్బులున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి: సోము వీర్రాజు
ఏపీలో అత్యధిక మంది సర్పంచ్‌లు వైఎస్ఆర్‌సీపికి చెందినవారే. నోరు తెరిస్తే ఎక్కడ పార్టీ ముఖ్య నేతలకు కోపం వస్తుందోనని వారు లోలోన మథనపడుతున్నారు. కొంత మంది మాత్రం అసంతృప్తితో బయటకు వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.