ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.  శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది.  రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో 2020 జనవరిలో  సీఎం జగన్  .. మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. వెంటనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అసంబ్లీలో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. తక్షణం మండలిని రద్దు చేయాలని కోరారు. 


Also Read: శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?


తీర్మానం సందర్భంగా సీఎం జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.  తమకు ఏడాదిన్నరలో పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేస్తున్నామని.. శానమండలి వల్ల ప్రజాదనం వృధా మినహా ఎలాంటి ఉపయోగం లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మండలి రద్దుపై వెనక్కి తగ్గారు.  ఈ మేరకు విడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. శాసనమండలిలో  ఖాళీ అవుతున్న ప్రతి ఎమ్మెల్సీకి వైఎస్ఆర్‌సీపీ సభ్యులే నామినేట్ అవుతున్నారు. గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఇలా ప్రతి స్థానం వైఎస్ఆర్‌సీపీకే దక్కుతోంది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలకు పదవులు దక్కుతున్నాయి. 


Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !


అయితే శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులను నామినేట్ చేయడం.... ఎెన్నికల్లో పాల్గొనడంపై  విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో జగన్ శాససనభలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారని... శాసనమండలి రద్దుపై వెనక్కి తగ్గబోమని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అదే పనిగా చెబుతున్నారు. కానీ తమకు పూర్తి మెజార్టీ వచ్చే సిరికి అందరూ అభిప్రాయాలు మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.  


Also Read: త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !


శాసనసభ సమావేశాలు మంగళవరం...లేదా బుధవారం ముగించేస్తారు. ఆ లోపే తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదించి.. కేంద్రానికి పంపే అవకాశం ఉంది. మండలి రద్దు తీర్మానం అందిన తర్వాత కేంద్రం పార్లమెంట్‌లో బిల్లులు పెట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు పరిమితంగా జరిగాయి.  అందుకే ఆ తీర్మానంపై కేంద్రం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సమయంలో  ఏపీ ప్రభుత్వం మండలి రద్దు వద్దని కేంద్రానికి మళ్లీ తీర్మానం పంపుతోంది. 


Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి