మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను వెనక్కి తీసుకుంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎక్కువ మంది ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి  తగ్గుతుందని అనుకోవడం లేదు. ఈ విషయంలో మంత్రి కొడాలి నాని  కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు వెనక్కి తీసుకున్నామని... ఈ విషయంలో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని అన్నారు. అదే సమయలో మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గరని ఆయన సంకేతం కూడా ఇచ్చారు. ఏం జరుగుతుందో.. అసెంబ్లీలో  చూడాలని అన్నారు.





 


Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?


మూడు రాజధానుల అంశానికి టెక్నికల్‌గా చాలా సమస్యలు ఉన్నాయని.. అందుకే న్యాయస్థానాల్లో నిలువలేకపోతున్నాయని ఆయన అన్నారు. అంటే.. టెక్నికల్‌గా సమస్యలు లేకుండా చేసుకుంటూ మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తారన్న భావన ఎక్కువ మందికి వస్తోంది. అది ఎలా ముందుకు తెస్తారన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాజధానిగా అమరావతిని మార్చాలంటే ఎన్నో న్యాయపరమైన చిక్కులతో ఉంది. ఎందుకంటే రైతులు దాదాపుగా 30వేల ఎకరాలను రాజధాని కోసం సీఆర్డీఏకి ఇచ్చారు. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాల ప్రకారం ... ఖచ్చితంగా రాజధానిని అభివృద్ధి చేయాలి. వారి ప్లాట్లను వారికి అప్పగించాలి.





 


Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !


అలా కాకుండా ఏం చేసినా చట్ట విరుద్దమే అవుతుంది. అదే సమయంలో అమరావతిని రాజధానిగా అంగీకరించే విషయంలో ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదు. అలా చేయడం  తమకు రాజకీయంగా కూడా నష్టం చేస్తుందని వారి అంచనా. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం వేరే వ్యూహంతో ఉందని.. అదేమిటో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేయబోయే ప్రకటనతోనే తేలిపోతుందంటున్నారు. ఇప్పుడు శాసనమండలిలో కూడా పూర్తి స్థాయిలో బలం ఉన్నందున కొత్త రూపంలో బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకుంటారని భావిస్తున్నారు.





 


Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !


లేదా ప్రస్తుతం సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లల ప్రక్రియనే కొనసాగించి.., సెలక్ట్ కమిటీ నివేదిక కూడా ఇప్పించి చట్ట బద్దంగా నిర్ణయం తీసుకున్నామనిపించేలా చేయవచ్చని కొంత మంది భావిస్తున్నారు.త అలా చేసినా చట్టం ప్రకారం చెల్లదన్న భావన కొంత మందిలో ఉంది.  ఎలా చూసినా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గదన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు.  


Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి