ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది.
అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు. ఈ విషయాన్ని హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు. న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు స్పందన తెలియాల్సి ఉంది.
Also Read: Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా పొట్లూరి స్రవంతి..
మూడు రాజధానుల బిల్లులు మొదటగా అసెంబ్లీలో పాసై మండలికి వచ్చాయి. అప్పట్లో మండలిలో ఆమోదం పొందలేదు. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా తర్వాత జరిగిన సమావేశాల్లో మరోసారి ఏపీ ప్రభుత్వం అవే బిల్లులను ప్రశవ పెట్టింది. అసెంబ్లీలో ఆమోదించింది. కానీ మళ్లీ మండలిలో ఆమోదం పొందలేదు. కానీ రెండు వారాల గడువు తర్వాత మండలి ఆమోదం కూడా అవసరం లేదని పాసయినట్లేనని చెప్పుకున్న ప్రభుత్వం బిల్లులను గవర్నర్‌కు పంపింది. ఆయన ఆమోద ముద్రవేశారు. ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. కానీ రైతులు మాత్రం చట్ట విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని కోర్టుకు వెళ్లారు.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు
మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: చంద్రబాబుకు సోనూసూద్ పరామర్శ... అసెంబ్లీ పరిణామాలపై విచారం వ్యక్తం