ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నటుడు సోనూసూద్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆ ఘటనపై సోనూసూద్ విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఫోనులో పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన శాసనసభలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని సోనూసూద్ అభిప్రాయపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి ధోరణులు మంచిది కాదన్నారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం అధికారపార్టీకి చెందిన పలువురు నేతలు తన సతీమణి భువనేశ్వరిని దూషించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడవడం రాజకీయ, సినీ ప్రముఖుల్ని కలచివేసింది. దీనిపై పలువురు సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Continues below advertisement


Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్
 చంద్రబాబుకు రజనీకాంత్ పరామర్శ


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా చంద్రబాబును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. రెండ్రోజుల కిందట అసెంబ్లీలో చంద్రబాబు భార్య పట్ల వైఎస్ఆర్ సీపీ నేతలు పరుష పదజాలాన్ని ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు.


Also Read: చంద్రబాబు కన్నీళ్లు.. ఆర్జీవీ ఇలా వాడేసుకున్నాడు..


అన్నాడీఎంకే నేత కూడా


తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని రజనీకాంత్‌ వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత డాక్టర్ మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని తాను బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ మైత్రేయన్ ప్రముఖ ఆంకాలజిస్టు. బసవతారకం కాన్సర్ ఆస్పత్రి ప్రారంభించిన నాటి నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.


Also Read: వరద బాధిత ప్రాంతాలకు చంద్రబాబు.. బాధితుల్ని ఆదుకోవాలని పార్టీ శ్రేణులకూ సూచనలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి