తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అయితే తాను రూపొందించిన 'పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ చూసే చంద్రబాబు ఏడ్చేశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో.. చంద్రబాబునాయుడు ఏడుస్తున్న క్లిప్ ను కట్ చేసి.. ఆయనే మాట్లాడుతున్నట్లుగా ఓ మిమిక్రీ వాయిస్ ను యాడ్ చేశారు.
''ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూడటం జరిగింది. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకేతై అర్థం కావడం లేదు'' అని చంద్రబాబు చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'చంద్రబాబు నాయుడు ఇప్పుడే ట్రైలర్ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూశారు. ఆయన రియాక్షన్ కు థాంక్స్ అని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వర్మపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.
'దీన్ని కూడా ప్రమోషన్స్ గా వాడేశావా..?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'బర్నింగ్ ఇష్యూని ప్రమోషన్స్ కు వాడుకోవడంలో నీ తరువాతే ఎవరైనా' అంటూ మరికొందరు వర్మ ప్రమోషన్స్ ని కొనియాడుస్తున్నారు. 'ఎలా వస్తాయ్ సర్ ఇలాంటి ఆలోచనలు' అంటూ ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమాను భీమవరం టాకీస్ బ్యానర్ పై ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి