19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ ఫైనల్ కి చేరేందుకు ఒకరికి అర్హత కల్పిస్తూ బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ ను ఆఫర్ చేశారు. ఈ పాస్ దక్కించుకున్న తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు నేరుగా ఫైనల్స్ కి వెళ్లిపోతారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గార్డెన్ ఏరియాలో ఉన్న ఫైర్ ఇంజన్లో రెండు సీట్లు ఉంటాయి. అలారం మోగిన వెంటనే ఎవరైతే ముందుగా వెళ్లి ఆ సీట్స్ లో కూర్చుంటారో.. వారి ఎదురుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. ఫైర్ ఇంజన్ లో కూర్చున్న ఇద్దరూ ఒక మాట మీద ఆ ఫొటోలలో ఒకరిని సేవ్ చేసి.. మరొకరిని కాల్చాల్సి ఉంటుంది. ఫైర్ ఇంజన్లో కూర్చున్న వాళ్లని హౌస్ మేట్స్ తమ ఫొటోలను కాల్చొద్దని కన్విన్స్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ లో ఎవరి ఫోటో అయితే చివరకి వరకూ కాల్చకుండా ఉంటుందో వారికి ఎవిక్షన్ పాస్ దక్కుతుంది.
Also Read: ఆ వీడియోలు నా దగ్గరున్నాయ్.. బిగ్ బాస్ అడల్ట్ సీన్స్ పై నటి కామెంట్స్..
అయితే ఈ ప్రాసెస్ లో చివరివరకు సన్నీ ఫోటో కాల్చకుండా ఉందని.. ఆయనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కిందని సమాచారం. తాజాగా విడుదలైన ప్రోమోలో ఫైర్ ఇంజన్లో ఉన్న మానస్, కాజల్.. యానీ, సిరిలలో ఒకరి ఫోటో కాల్చాల్సి ఉంటుంది. అయితే ఇద్దరి ఫోటోలు కాల్చేయాలనేది కాజల్ ప్లాన్. ఆ విధంగా సన్నీ నేరుగా ఎవిక్షన్ పాస్ దక్కించుకుంటాడనేది కాజల్ ఆలోచన. కానీ దానికి మానస్ ఒప్పుకున్నట్లుగా లేదు.
ఆ సమయంలో సన్నీ వచ్చి 'ఫస్ట్ టైం నా దోస్తుల చేతులో పడ్డాది నా ఫ్యూచర్' అంటూ డైలాగ్ వేశాడు. ఇది చూస్తుంటే సన్నీకి ఎవిక్షన్ పాస్ వచ్చినట్లే ఉంది. అయితే ఈ ఎవిక్షన్ పాస్ పవర్ ఏంటో తెలుసా..? ఈ పాస్ ద్వారా ఎలిమినేషన్ నుంచి సన్నీ సేవ్ కావచ్చు. లేదా.. దాన్ని ఉపయోగించి వేరొకరిని సేవ్ చేయొచ్చు. మరి సన్నీ ఆ ఫ్రీ పాస్‌ను తన కోసం వాడతాడా..? లేక మరెవరి కోసమైనా వాడుతాడా..? అనేది చూడాల్సి ఉంది.
గత సీజన్ లో ముక్కు అవినాష్ కి ఫ్రీ ఎవిక్షన్ పాస్ వచ్చింది. అయితే ఆ పాస్ ను తనకోసమే వాడుకున్నాడు అవినాష్. మోనాల్ తో పాటు అతడు చివరి వరకు నామినేషన్ లో ఉన్న సమయంలో ఫ్రీ పాస్ ను వాడుకోగా.. అప్పుడు మోనాల్ సేవ్ అయింది. జనాలు తనను సేవ్ చేయలేదని.. అప్పుడు అవినాష్ చాలా ఫీలైపోయాడు.
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి