Bangarraju: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

‘బంగార్రాజు’ చిత్రంలో కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ను నాగ చైతన్య విడుదల చేశాడు. పోస్టర్ చూస్తుంటే.. బేబమ్మకు మాంచి పాత్రే లభించినట్లుంది.

Continues below advertisement

‘మనం’ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా ‘సొగ్గాడే చిన్ని నాయనా’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ గురువారం ‘నాగలక్ష్మి’ పాత్ర పోషిస్తున్న ఉప్పెన బ్యూటీ.. కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ను నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున - చైతు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

Continues below advertisement

‘బంగార్రాజు’ చిత్రంలో నాగలక్ష్మి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నామని చైతూ ఈనెల 16న ప్రకటించాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ‘‘బాగుంది రా.. మరి, బంగార్రాజు పరిస్థితి ఏమిటీ’’ అని అడిగాడు. అయితే, చైతూ గురువారం దీనికి రిప్లై ఇచ్చాడు. నాగలక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘‘బంగర్రాజు త్వరలోనే వస్తాడు. లేడిస్ ఫస్ట్’’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. ఇందులో కృతిశెట్టి మెడలో దండ వేసుకుని.. ఒక చేతితో సన్ గ్లాసెస్ పట్టుకుని స్టైల్‌గా కనిపిస్తోంది. అంతేకాదు.. జనాలు ఆమెపై పలు చల్లుతూ జేజేలు పలుకుతున్నారు. చూస్తుంటే.. ఇందులో నాగలక్ష్మి పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండేలా ఉంది. 

దాదాపు ముగింపు దశకు చేరుకుందని సమాచారం. దాదాపు నాలుగేళ్లపాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చిత్రబృందం మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసేసింది. ఇప్పటికే సినిమా నుంచి ‘లడ్డుండా’ అనే పాటను విడుదల చేశారు.

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola