రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకల్లా ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు అధికారులు. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తెలిసే అవకాశముంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 12 గంటల తర్వాత వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
మొత్తం 14 జడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా, నాలుగు ఏకగ్రీవం కావండతో పది చోట్ల ఎన్నికలు జరిగాయి. 176 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, ఏకగ్రీవాలు మినహా 123 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, వాటి ఫలితాలు ఈరోజు వెలువడతాయి.
నెల్లూరు జిల్లా విషయానికొస్తే.. ఏడు ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా నాలుగు చోట్ల ఎన్నికలు జరిగాయి. కోట మండలంలోని కోట ఎంపీటీసీ స్థానానికి, సైదాపురం మండలం అనంతపురం స్థానానికి, కోవూరు మండలం గంగవరం, బాలాయపల్లి మండలంలోని ఓ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు చోట్ల ఇప్పుడు కౌంటింగ్ మొదలైంది. ఉదాయన్నే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు 8 గంటలకు లెక్కింపు మొదలు పెట్టారు.
అనంతపురంలో ఇలా..
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో మూడు గదులలో 15 టేబుల్ ద్వారా లెక్కింపు జరిపారు.
కడప జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గొరిగనూరు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానానికి ముద్దనూరు కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్ మొదలైంది. ఆ మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
Also Read: మానేరులో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం
Aslo Read: CM KCR: ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలివ్వమని చెప్పండి.. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ..
Also Read: Tollywood Updates: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్