చలికాలం వస్తూనే ఎన్నో ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, సైనస్ ఉన్నవారికైతే ఈ కాలం చాల ఇబ్బంది పడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చలికాలంలో కూడా శరీరంలోపల వెచ్చగా ఉంటే ఎలంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఆహారం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. రోజూ మనం తినే ఆహారంలో కింద చెప్పిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా శరీరానికి వెచ్చదనాన్ని అందించేవే. 


 తేనె
రోజూ స్పూను తేనెను నేరుగా తినడమో, లేక పాలల్లో కలుపుకుని తినడమో చేయాలి. తేనెలో జలుబు వంటి సమస్యలతో పోరాడే గుణం ఉంది. 


తులసి, అల్లం
రోజూ టీ తాగే  అలవాటు ఉంటే, అందులో కాస్త తులసి రసం, అల్లం రసం కలుపుకుని తాగడం మొదలుపెట్టాలి. చలికాలంలో ఈ రెండింటి కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది. 


నెయ్యి
అమ్మో లావైపోతాం అనుకోకుండా... రోజుకో స్పూను నెయ్యి వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలి. ఒక్క స్పూను వల్ల బరువు పెరిగిపోరు. అంతేకాదు ఇది చెడు కొవ్వులను పేరుకుపోకుండా నిరోధిస్తుంది. 


డ్రై ఫ్రూట్స్
చలికాలంలో ఉత్తమ ఆహారం డ్రై ఫ్రూట్స్. ఆప్రికాట్లు, అంజీర్లు, నట్స్ వంటివి తింటే శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. 


చిరుధాన్యాలు
రాగులు, సజ్జలతో చేసిన వంటకాలు కూడా తినడం అలవాటు చేసుకోవాలి. చలిని శరీరం బయటే ఉంచేలా చేయడంలో ఇవి దిట్ట. 


బెల్లం
రోజూ ఏదో ఒక సమయంలో చిన్న ముక్క బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం వెచ్చదనం కోసమే కాదు, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 


దాల్చిన చెక్క
వంటల్లో దీన్ని భాగం చేసుకోండి. ఇది జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. చలి వాతావరణంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. 


నువ్వులు
రోజుకో నువ్వుల లడ్డూ, లేదా నువ్వుల పచ్చడి... ఎలా తిన్నా మీ ఇష్టం. శ్వాసకోశ సమస్యలు రాకుండా అడ్డుకోవడంతో దీనికిదే సాటి. 


వేడి సూప్‌లు
సాయంత్రవేళల్లో వేడి వేడి సూప్ లు తాగాలి. చికెన్ సూప్, కార్న్ సూప్, టమాటా సూప్... ఏదైనా. వెంటనే శరీరంపై ప్రభావం చూపిస్తాయివి.


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read also: శీతాకాలంలో గుండెపోటు అధికంగా వస్తుంది ఎందుకు? రిస్క్ ఇలా తగ్గించుకోండి
Read also: పాలు, అరటిపండు ఒకేసారి తినకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also:  అవిసెగింజలు తింటే ఆరోగ్యం... కానీ ఏం చేసుకుని తినాలో తెలియడం లేదా? ఇవిగో కొన్ని రెసిపీలు...
Read also: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి