Faria Abdullah: 'బంగార్రాజు'తో మాస్ స్టెప్పులు.. 'జాతిరత్నాలు' బ్యూటీకి క్రేజీ ఛాన్స్..

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమాలో ఫరియా ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతుందని సమాచారం.

Continues below advertisement

'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా. అయినప్పటికీ.. ఆమెకి మరో సినిమా అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఫైనల్ గా ఓ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'ఢీ' సీక్వెల్ లో ఫరియాను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ లో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి ఇది ప్రీక్వెల్. ఈ సినిమాలో ఫరియా ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతుందని సమాచారం. సోగ్గాడే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు ఈసారి రొమాంటిక్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు, మూడు స్పెషల్ సాంగ్స్ ఉంటాయని చెబుతున్నారు. వాటిలో ఒక పాటలో ఫరియా అబ్దుల్లా కనిపించబోతుంది. 

నిజానికి ఫరియా మంచి డాన్సర్. హిప్ హాఫ్, బీ బాయింగ్, బేలేలే వంటి వాటిలో ఆమె శిక్షణ తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు పలు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన డాన్స్ కారణంగానే ఫరియాకు ఈ సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు.

నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, చైతుకి జంటగా కృతిశెట్టి కనిపించనున్నారు. రీసెంట్ గానే సినిమాలో కృతిశెట్టి లుక్ ను రివీల్ చేశారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడే ఛాన్స్ ఉంది. 

Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...

Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్

Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!

Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement