బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా భారీ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇందులో ఫ్రెండ్షిప్స్, లవ్ ట్రాక్స్ చాలా కామన్. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సీజన్లలో చాలా లవ్ ట్రాక్స్ చూశాం. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కొన్ని ట్రాక్ లు నడుస్తున్నాయి. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలా ఉంటారో తెలియదు కానీ హౌస్ లో మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సిరి-షణ్ముఖ్ ల ప్రవర్తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి షణ్ముఖ్ చాలా కాలంగా దీప్తితో రిలేషన్ లో ఉన్నాడు. సిరికి కూడా బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ హౌస్ లోకి వచ్చిన తరువాత ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు. 


Also Read: బాలయ్యతో రొమాన్స్.. ఛాన్స్ లేదంటున్న శృతి..


అదే విషయాన్ని శ్రీరామచంద్రతో డిస్కస్ చేశాడు షణ్ముఖ్. రవి అయితే 'మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో.. మీరే చూసుకోండి' అంటూ సిరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. బహుశా జెస్సీ హౌస్ లో ఉంటే వేరేలా ఉండేదేమో కానీ ఇప్పుడైతే సిరి-షణ్ముఖ్ ఒకరిని వదిలి మరొకరు దూరంగా ఉండలేకపోతున్నారు. ఈ పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు చూసే బిగ్ బాస్ షో లవర్స్ కి అడ్డాగా మారిందని ఫైర్ అయింది. 


ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''చక్కగా గుడ్ నైట్ చెప్పేసి చల్లగా పడుకుందాం మార్నింగ్ కార్తీక పూర్ణిమ ఉంది కదా అనుకుంటే.. బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి, గుస గుస అని మెసేజీలు పెడితే ఎలా బజ్జోవాలి నేను. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా.. కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా వద్దు ఈ బాధ'' అంటూ రాసుకొచ్చింది. అలానే బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ కి సంబంధించిన.. ఆ వీడియోలు, ఫోటోలు తన దగ్గరకు వచ్చాయని.. కానీ వాటిని పబ్లిష్‌ చేయడం కల్చర్‌ కాదంటూ చెప్పుకొచ్చింది. 


Also Read: 'బంగార్రాజు'తో మాస్ స్టెప్పులు.. 'జాతిరత్నాలు' బ్యూటీకి క్రేజీ ఛాన్స్..


Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!


Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...


Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్


Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!


Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి