బిగ్‌బాస్ ఇంట్లో సిరి, షన్ముఖ్‌లు మంచి స్నేహితులని చెప్పుకుంటున్నా.. వారి చేష్టలు మాత్రం ప్రేక్షకులకు వేరేలా అనిపిస్తున్నాయి. అయితే, బిగ్ బాస్‌లో రిలేషన్‌షిప్స్ సర్వసాధారణమే. కానీ, సిరికి అల్రెడీ తన సహ నటుడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. షన్ముఖ్‌కు ఇప్పటికే దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అయితే, అది బిగ్‌బాస్ ఇల్లు. షన్ను, సిరిలు బయట కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నారు. అయితే, ఒకరికి ఒకరు తోడుంటూ.. కాస్త ఎక్కువగానే దగ్గరవ్వుతున్నారు. అయితే, తాజా ఎపిసోడ్‌లో వారిద్దరూ ఒకరినొకరు బెడ్ మీద గట్టిగా హగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సిరి లిప్స్.. షన్నుతో లాకైనట్లు కనిపించింది. దీంతో బిగ్ బాస్ ఆ సీన్‌ను కొన్ని సెకన్లు బ్లర్ చేసినట్లు కనిపించింది. అయితే, అది యాక్సిడెంటల్‌గా జరిగిందని, ఆమె కావాలని లిప్ లాక్ చేయలేదని నెటిజనులు అంటున్నారు. అయితే, అక్కడ ఏం జరిగిందనేది ఆ బిగ్ బాస్‌కే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే.. చిన్న సీన్ లేదా పొరపాటును పట్టుకుని వారు తప్పు చేశారంటూ.. వారి క్యారెక్టర్‌ను తప్పు పట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రస్తుతం.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు అదే పనిలో ఉన్నాయి. అయితే, వీరి రిలేషన్ హద్దులు దాటుతుందా అనే అనుమానం మాత్రం చాలామందిలో ఉంది. జెస్సీ బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత వీరి స్నేహం మరింత బలపడింది.
షన్నుపై సన్నీ, మానస్ అనుమానం: ఇక తాజాగా ఎపిసోడ్‌లోకి వస్తే.. స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో సన్నీ టీషర్ట్ సరిగ్గా ధరించలేదని రవి అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే, సన్నీ మాత్రం.. తాను తప్పు చేయకుండా టాస్క్ పూర్తి చేశాననే నమ్ముతున్నాడు. సన్నీ ఇక ఆట అడనని అలిగాడు. దీంతో షన్ను.. నువ్వు ఆడాల్సిందేనని షన్ను ప్రోత్సహించడం గమనార్హం. అయితే, సన్నీకి మాత్రం షన్ను మీద అనుమానం ఉంది. షన్ను సలహాతోనే రవి టీషర్ట్ విషయంలో నిర్ణయం మార్చుకున్నాడేమోనంటూ సన్నీ, మానస్ చర్చించుకున్నారు. పవర్ రూమ్ యాక్సెస్ పొందిన రవి.. తన పవర్‌ను సన్నీకి ఇస్తానని తెలిపాడు. అయితే, సన్నీ ఇందుకు ఒప్పుకోలేదు. అది బిగ్ బాస్ నిర్ణయమని, తప్పకుండా తీసుకోవల్సిందేనని రవి ఒప్పించాడు. అయితే, ఆ పవర్‌ను వాడేందుకు సన్నీ నిరాకరించాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం వదల్లేదు. అది వాడాల్సిందేనని చెప్పడంతో సన్నీ అంగీకరించక తప్పలేదు.
కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికైంది వీరే: ఆ తర్వాతి టాస్క్‌లో మానస్, శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్‌లు హెల్మెట్ సొంతం చేసుకుని గోల్డ్ మైన్ చేసే అర్హత సాధించారు. అయితే, సన్నీకి లభించిన పవర్ ప్రమాకారం ముగ్గురిలో ఒకరిని తప్పించి.. ఆ స్థానాన్ని కైవసం చేసుకొనే పవర్ లభిస్తుంది. దీంతో సన్నీ శ్రీరామ చంద్రను పక్కకు తప్పించి.. ఆ స్థానాన్ని సన్నీ తీసుకున్నాడు. చివరికి మానస్, ఆనీ మాస్టరే ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకోవడంతో బిగ్ బాస్ వారిద్దరికి ముళ్లు వేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆనీ మాస్టర్ విజయం సాధించింది. ఫలితంగా సిరి, ప్రియాంక, ఆనీలు కెప్టెన్సీ పోటీదారులయ్యారు. నాలుగో కంటెస్టెంట్ కోసం మానస్, సన్నీ, కాజల్ మధ్య మ్యాథ్స్ టాస్క్ జరిగింది. 17 సంఖ్యలతో 143 టోటల్ వచ్చేలా నెంబర్ బోర్డులను తగిలించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మానస్ విజయం సాధించి నాలుగో కెప్టెన్సీ పోటీదారుడుగా ఎంపికయ్యాడు.
Also Read: సంపూ అరుపు.. నవ్విస్తున్న విషాద గీతం.. ‘పగిలిందా నీ తాళం.. పోయిందా నీ శీలం..’
సిరి, షన్నుల మధ్య మళ్లీ గొడవ: బిగ్ బాస్‌లో సిరి, షన్నులు పోట్లాడటం, అలగడం, మళ్లీ కలిసిపోవడం, హగ్గులు ఇచ్చుకోవడం రొటీన్‌గా మారిపోయింది. తాజా ఎపిసోడ్‌లో కూడా ఏదో విషయం మీద ఇద్దరు గొడవపడ్డారు. టిష్యూ మీద లిప్ స్టిక్‌తో ‘I Hate You’ అని రాసి షన్నుకు ఇచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన షన్ను.. నేను ఏం చేశానురా అని సిరిని అడిగాడు. ఆ తర్వాత కాసేపటికే వారిద్దరు బెడ్ మీద గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ సమయంలో అనుకోకుండా లిప్స్ తగినట్లుగా కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు తమ పార్టనర్లను గుర్తు చేసుకున్నారు. సిరి తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూస్తూ.. షన్ను దీప్తి టాటాను చూస్తూ షన్ను భావోద్వేగానికి గురయ్యారు. మరో వైపు ప్రియాంక, మానస్‌ల మధ్య కూడా గొడవ జరిగింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అలా ముగిసింది. తర్వాతి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ పోటీ దారులకు ఒక రింగ్ ఇచ్చి పోటీపడాలని చెప్పాడు బిగ్‌బాస్.
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి