కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 30 మంది వరదలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్‌, ఇద్దరు ప్రయాణికులు వరదలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు ఉన్నారు.  


Also Read: రాజంపేట లో నీటిలో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు



వరద ఉద్ధృతిలో 30 మంది గల్లంతు


వరదనీటి వల్ల గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున వరద నీరు నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరులో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గల్లైంత వారి సహాయక బృందాలు గాలిస్తున్నాయి. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలను గుర్తించారు. గండ్లూరు శివాలయం సమీపంలో 7, రాయవరంలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. 30 మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు ఉంటున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.


Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి



దాదాపు 50 మంది గల్లంతు : ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి


చెయ్యేరు నది జలవిలయం కనివిని ఎరుగని విపత్తు అని, ఎవ్వరూ ఊహించని విధంగా వరద నీరు పొటెత్తిందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ అన్నారు. రాజంపేట నందలూరు, చొప్పవారి పల్లెలో వరద బీభత్సాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో దాదాపు 50 మంది గల్లంతయ్యారని అంచనా అన్నారు. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించామన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అదేశించారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నీళ్లలొ చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపారన్నారు. మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించడం జరిగిందన్నారు. ఎక్స్ గ్రేషియోను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. రేపటికి మృతుల విషయంలో క్లారిటీ వస్తుందన్నారు.





 


Also Read: కడప జిల్లాలో వర్ష బీభత్సం... అన్నమయ్య డ్యాం మట్టికట్టకు గండి... వరదలో 30 మంది గల్లంతు..!