బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో మరియు పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్య దిశగా 80 కి.మీ దూరంలో నెలకొని ఉంది.





 


ఉత్తర తమిళనాడు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై కదులుతూ శుక్రవారం ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావం ఉత్తర తమిళనాడులో అధికంగా ఉండనుందని, అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దాని సమీప ప్రాంతాలు, ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయిని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
Also Read: Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. రూ.400 ఎగబాకిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..






ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో మరో 5 రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్ష ముప్పు పొంచి ఉందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్లనుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. యానాం, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజుల వరకు వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
Also Read: అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వానలు.. చెన్నై-పుదుచ్చేరి మధ్య శుక్రవారం తీరం దాటే అవకాశం






బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండం ఏపీ, తమిళనాడును చేరడంతో ఇది జవాద్ తుపానుగా మారే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు దక్షిణ ఛత్తీస్ గఢ్‌లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నేడు వాయుగుండం తీరాన్ని దాటనుండటంతో ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతోంది. సెలవులు రద్దు చేసుకుని సైతం పనులు చేయాలని ఏపీలోని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఉద్యోగులకు ఆదేశాలిచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 





పాఠశాలలకు సెలవు.. 
మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి