మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. విండోస్ 11తో లాంచ్ అయిన మొదటి మైక్రోసాఫ్ట్ డివైస్ ఇదే. సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో, సర్ఫేస్ ప్రో 8, సర్ఫేస్ డ్యుయో 2లతో పాటు ఇది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయింది. మనదేశంలో మాత్రం కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్పేస్ గో 2 కంటే.. సర్ఫేస్ గో 3 60 శాతం వేగంగా పనిచేస్తుంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. వెనకవైపు, ముందువైపు 1080పీ కెమెరాలు అందించారు.
సర్ఫేస్ గో 3 ధర
దీని ధరను మనదేశంలో రూ.57,999గా నిర్ణయించారు. ఇందులో టెన్త్ జనరేషన్ ఇంటెల్ పెంటియం గోల్డ్ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్ఎస్‌డీని ఇందులో అందించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభం అయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులకు రూ.9,699 విలువైన సర్పేస్ పెన్‌ను ఉచితంగా అందించనున్నారు. నవంబర్ 23వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
బిజినెస్ కస్టమర్లకు దీన్ని రూ.42,999కే విక్రయించనున్నారు. అయితే ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ ఉండనుంది. ఇందులో ఇంటెల్ ఐ3 ప్రాసెసర్ వేరియంట్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.47,999గా ఉంది. ఐ3 ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్ఎస్‌డీ ఉన్న వేరియంట్ ధర రూ.62,999గా ఉంది. ఇవి ఆథరైజ్డ్ రీసెల్లర్ల వద్ద డిసెంబర్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
సర్ఫేస్ గో 3 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. సర్ఫేస్ గో 2కి, సర్ఫేస్ గో 3కి పెద్ద తేడాలు కనిపించవు. ఇందులో 10.5 అంగుళాల టచ్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. ఇందులో వెనకవైపు, ముందువైపు 1080పీ కెమెరాలు అందించారు. డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. ఇందులో స్టూడియో మైక్రో ఫోన్లు కూడా అందించారు.
కనెక్టివిటీ మరింత వేగంగా ఉండేందుకు ఇందులో ఆప్షనల్ ఎల్టీఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్ సర్ఫేస్ గో సిగ్నేచర్ టైప్ కవర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీన్ని డిటాచబుల్ కీబోర్డులా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో ప్రీలోడెడ్ విండోస్ 11ను అందించారు.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!