చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. అక్కడి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వరద పరిస్థితుల గురించి తెలుసుకుని ప్రజలకు సాయం చేయాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ , ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. మందులు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పార్టీ శ్రేణులు కూడా శక్తి మేర సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 


Also Read : తిరుపతిలో వరద బీభత్సం... ప్రమాదకరంగా రాయలచెరువు కట్ట... అప్రమత్తంగా ఉండాలని అధికారుల దండోరా


ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని సవాల్ చేశారు. దీంతో ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదు. అలాగే ఈ సెషన్ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలని నిర్ణయించుకున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో  తీవ్ర స్థాయిలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతి వంటి పట్టణాల్లోనే విద్యుత్ పునరుద్ధరణకు రెండు రోజులకుపైగానే పట్టింది. ఇప్పటికి చాలా ప్రాంతాలకు కరెంట్ సౌకర్యం లేదు. 


Also Read:  గుండె చెరువైన సీమ, నెల్లూరు .. ఎటు చూసినా ప్రళయ బీభత్స దృశ్యాలే ! 


ఇక గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది. చెయ్యేరు డ్యాం మట్టికట్ట తెగిన ప్రభావం వల్ల పదుల సంఖ్యలో గ్రామాలు శిథిలం అయిపోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రభుత్వం వైపు నుంచి అరకొర సాయం మాత్రమే అందుతోంది. చివరికి సహాయ, పునరావాస శిబిరాలు కూడా ముందుగా ఏర్పాటు చేయలేదు. దీంతో  ప్రజలకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెల్లూరులోనూ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ సాయానికి ముందుకు రాకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. 


Also Read: నెల్లూరులో వర్షం తగ్గినా వదలని వరద.. హైవేలపై నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం


ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసి మళ్లీ తాడేపల్లికి వెళ్లిపోయారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీతో భేటీ ఉండటం వల్ల ఏరియల్ సర్వే అనంతరం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చర్చించి బాధితలకు అందించాల్సిన సాయంపై సమీక్ష నిర్వహించలేకపోయారు. బాధితులు ప్రభుత్వం ఏమైనా సాయం ప్రకటిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అండగా ఉంటామని చెప్పేందుకు చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. 


Also Read: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి