సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో హాస్పిటల్ కి త‌ర‌లించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తరువాత కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని తెలుస్తోంది.


Also Read: స‌ల్మాన్‌తో రాజ‌మౌళి మీటింగ్‌... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?


వయసురీత్యా కొన్ని రోజుల నుంచి కైకాల సత్యనారాయణ బయటకు రావడం లేదు.  సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడూ కొందరు ప్రముఖులు ఆయన్ను ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నారు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లి వచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


1959లో 'సిపాయి కూతురు' అనే సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 777 చిత్రాల్లో న‌టించారాయన. న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌమగా చిత్రపరిశ్రమ, అభిమానులు ఆయన్ను పిలుచుకుంటూ ఉంటారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల టాలెంటెడ్ నటుడు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తాడు. ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది కైకాల మాత్రమే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు.1960లో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 


Also Read: బాలీవుడ్‌కు నాగ‌చైతన్య ప‌రిచ‌య‌మ‌య్యేది ఆ రోజే... లాల్ సింగ్ చ‌ద్దా కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!


Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్


Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్


Also Read: ఈటెల రాజేంద‌ర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!


Also Read: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో రౌడీ హీరో.. హిట్ అందుకుంటాడా..?


Also Read: చంద్రబాబు కన్నీళ్లు.. ఆర్జీవీ ఇలా వాడేసుకున్నాడు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి