హాలీవుడ్‌లో ఓ ట్రెండ్ ఉంది. సినిమా రిలీజైన కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేస్తారు. ఓ షాట్, సన్నివేశం తీయడం వెనుక తన ఆలోచనలను దర్శకుడు వివరిస్తారు. అది వినాలని అనుకునేవాళ్లు అది వింటూ సినిమా చూడొచ్చు. తెలుగులోకి, ఆ మాటకు వస్తే ఇండియాలోకి ఈ ట్రెండ్‌ను తీసుకొస్తున్నారు దర్శకుడు దేవ్ కట్టా.

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన సినిమా 'రిపబ్లిక్'. జె.బి. ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు, న్యాయ వ్యవస్థ మధ్య ఎటువంటి సమన్వయం ఉండాలనే కథతో సినిమా రూపొందింది. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన 'రిపబ్లిక్', ఈ నెల 26న 'జీ 5' ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి  వస్తోంది. అందులో డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేస్తున్నట్టు 'జీ 5' బృందం, దేవ్ కట్టా తెలిపారు. మన దేశంలో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి అని వివరించారు.


'రిపబ్లిక్' ఎడిటర్ కె.ఎల్. ప్రవీణ్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బి.కె.ఆర్. సతీష్... ముగ్గురితో సినిమా స్టార్టింగ్, హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకూ దేవ్ కట్టా డిస్కస్ చేయనున్నారు. ఆ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే వీక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మ‌ల్‌గా సినిమాను సినిమాలా కూడా చూడ‌వ‌చ్చు.


Also Read: మదరాఫ్ డ్రాగన్... వైఫ్‌కు గమ్మత్తుగా బర్త్ డే విషెస్ చెప్పిన నాని!
Also Read: ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళుతుంటే ఒకడు పక్కకి లాక్కుని...
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి