సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురి కావడంతో గత వారం ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి తొలుత క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పినా... తర్వాత రెండు రోజులకు కోలుకుంటున్నారని వెల్లడించారు. అయితే... అనూహ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కైకాల మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బావుందని, కోలుకుంటున్నారని వెల్లడించారు.
"నేను కైకాల రామాదేవి. సత్యనారాయణ గారి అమ్మాయిని. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బావుంది. ఆయన కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్, యాక్టర్ మాదాల రవి గారు వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడారు. థంబ్స్ అప్ సింబల్ చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీవీల్లో తప్పుడు సమాచారం చూపించి అందరినీ ఆందోళనకు గురి చేయవద్దు" అని కైకాల సత్యనారాయణ కుమార్తెల్లో ఒకరైన రమాదేవి ఓ వాయిస్ నోట్ విడుదల చేశారు. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితికి వస్తే... బీపీ తగ్గడంతో పాటు కిడ్నీ పనితీరు మెరుగైందని, నిదానంగా వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
Also Read: 'భీమ్లా నాయక్' గురించి త్రివిక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Also Read: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందా..? ప్రూఫ్ చూపిస్తోన్న నెటిజన్లు..
Also Read: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి