Anil Ravipudi: బాలకృష్ణతో కామెడీ సినిమా చేయనంటున్నారు! ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు...

నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

Continues below advertisement
నట సింహం నందమూరి బాలకృష్ణ, ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఇది తెలిసిన సంగతే. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఇది కామెడీ సినిమా అనేది ఒకటి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అది అవాస్తవం అని అనిల్ రావిపూడి తెలిపారు. "బాలయ్య గారితో నేను కామెడీ సినిమా తీయలేను.  ఆయనది మాస్ ఇమేజ్. అందుకు తగ్గట్టు కథ కూడా సీరియస్ డ్రామాగా ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు కొంత కామెడీ ఉంటుంది" అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు. అంతకు ముందు... డిసెంబర్ 2న బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడోసారి నటించిన 'అఖండ' విడుదల కానుంది. గోపీచంద్ మలినేని సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Also Read: బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ అదే... ప్రిపేర్ అయ్యే టైమ్ కూడా లేదట!
ప్రస్తుతం అనిల్ రావిపూడి కూడా 'ఎఫ్ 3' షూటింగులో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఆయన తీసిన హిట్ సినిమా 'ఎఫ్ 2' తర్వాత... ఆ సినిమాలో క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ తీసుకుని కొత్త కథతో ఆయన చేస్తున్న చిత్రమిది. 'ఎఫ్ 2'లో భార్యాభర్తల బంధాలు, భర్తల ఫ్రస్ట్రేషన్  చూపించారు. 'ఎఫ్ 3'లో డబ్బు కోసం హీరోలు పడే ఫ్రస్ట్రేషన్  చూపించబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ మీద అనిల్ రావిపూడి వర్క్ చేయనున్నారు. ఆల్రెడీ ఆయన మనసులో ఐడియా ఫిక్స్ అయ్యిందని టాక్. ఆ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని అనిల్ అంటున్నారు. వచ్చే ఏడాది జూలైలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 
Also Read: జనని... 'ఆర్ఆర్ఆర్'లో మూడో పాట విడుదలయ్యేది ఎప్పుడంటే?
Also Read: హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
Also Read: మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Continues below advertisement
Sponsored Links by Taboola