తెలుగులో 'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ 4లోని బ్యూటీఫుల్ లేడీస్‌లో మోనాల్ గజ్జర్ ఒకరు. మిగతా అమ్మాయిలు అందరూ హైదరాబాద్ బేస్డ్ అమ్మాయిలే. మోనాల్ మాత్రం గుజరాతీ అమ్మాయి. గతంలో తెలుగు సినిమాలు కొన్ని చేసినప్పటికీ... 'బిగ్ బాస్'కి ముందు ఆమె చేతిలో అవకాశాలు ఏమీ లేవనే చెప్పాలి. అటువంటి సమయంలో ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది 'బిగ్ బాస్'. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'అల్లుడు అదుర్స్'లో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ అందుకున్నారు. ఆ తర్వాత 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సరసన 'తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి' సినిమా అంగీకరించారు. ఇప్పుడు ఆమె పూర్తిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.
అవును... ఇప్పుడు మోనాల్ గజ్జర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి భాగ్య నగరానికి వచ్చేశారు. గచ్చిబౌలి ఏరియాలో ఉంటున్నానని చెప్పారు. తల్లి, చెల్లి... వాళ్లిద్దరూ తనకు రెండు కళ్లు అని చెప్పారు. వాళ్లిద్దరితో పాటు ఆమె ఉంటున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా 'తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి'తో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అలాగే, మాతృభాష గుజరాతీలో రెండు సినిమాలు చేస్తున్నట్టు ఆమె  చెప్పారు. మొత్తం మీద మళ్లీ మోనాల్ గజ్జర్ బిజీ బిజీ అయ్యారు. 'బిగ్ బాస్ 5' గురించి కూడా మోనాల్ గజ్జర్ స్పందించారు. సింగర్ శ్రీరామ్ చంద్ర ప్రవర్తన తనకు నచ్చిందన్నట్టు చెప్పుకొచ్చారు.





పెళ్లి గురించి మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ "నేను ఇండిపెండెంట్ గాళ్. నా గురించి నేను చూసుకోగలను. నా బిల్స్ నేనే పే చేస్తున్నాను. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? ఎవరిని పెళ్లి చేసుకుంటాను? అనేది నాకు తెలియదు. ఎప్పుడు చేసుకున్నా చెప్పే చేసుకుంటాను" అని అన్నారు.

Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
Also Read: మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం
Also Read: భర్త రాజ'శేఖర్' కోసం... మళ్లీ మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్!
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి