తెలంగాణ ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వినూత్న ప్రయత్నాలను అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్టీసీపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కల్పించేందుకు చేస్తున్న ప్రకటనల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. పెద్దగా ఖర్చు లేకుండా ఉంటున్న ఈ షార్ట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి.


తాజాగా భీమ్లా నాయక్‌ టైటిల్ సాంగ్ పాట పాడి ఆకట్టుకున్న జానపద గాయకుడు కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ప్రచారంలో భాగం చేశారు. ఈ మేరకు ఓ వీడియో చేశారు. ఆర్టీసీ బస్సు ముందు కిన్నెర మొగులయ్య సంస్థను, సేవలను కీర్తిస్తూ పాట పాడిన విధానం ఆకట్టుకుంది. అచ్చం భీమ్లా నాయక్ ట్యూన్‌లోనే పాడిన ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈయన తన కుమార్తె పెళ్లికి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారని, ఆయన స్వీయ అనుభవాన్ని ఇలా పాట రూపంలో పంచుకున్నారని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.






Also Read: Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..


‘‘కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.’’ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేయగా.. దాన్ని సజ్జనార్ రీట్వీట్ చేశారు. బుక్‌ చేసిన గంటలోనే బస్సు వచ్చిందని.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందని పాట రూపంలో పాడారు. పెళ్లికి సురక్షితంగా వెళ్లి వచ్చామని ఆలపించారు. అది ఆర్టీసీ బస్సు కాదని, తల్లిలాంటిదని మొగిలయ్య కొనియాడారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. దీంతో మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ శభాష్‌ అని మెచ్చుకున్నారు.






Also Read: Mlc Elections: టీఆర్ఎస్ స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...!


Also Read: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు


Also Read: కొత్త మారుతి బ్రెజా లుక్ ఇదే.. పూర్తిగా మారిపోయిన డిజైన్.. ప్రీమియం లుక్‌లో!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి