టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసింది. రేపు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం అధికారకంగా ప్రకటించనున్నారు. రేపు, ఎల్లుండి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు చోటుదక్కలేదు. కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also Read: చిత్తశుద్ధితోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు: ఢిల్లీలో కేటీఆర్
- ఆదిలాబాద్ - దండే విఠల్
- మహబూబ్ నగర్- గాయకుడు సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి
- ఖమ్మం- తాత మధు
- రంగారెడ్డి -శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి
- వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి-
- నల్గొండ- ఎం.సి కోటిరెడ్డి
- మెదక్ - డాక్టర్ యాదవ రెడ్డి
- కరీంనగర్ - ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు
- నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత లేదా ఆకుల లలిత
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయింది. 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగున్నాయి. ఖమ్మం, మెదక్, నిజామాబాద్, జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.
Also Read: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
జనవరి 4వ తేదీకి పదవీకాలం పూర్తి
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికైనా భానుప్రసాదరావు, పురాణం సతీశ్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తవ్వనుంది. హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరంతా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు