రాజస్థాన్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 15 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జైపుర్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 11 మంది కేబినెట్ మంత్రులు ఉండగా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. దీంతో గహ్లోత్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 30కి చేరింది.
సచిన్ వర్గం..
నూతన మంత్రివర్గంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఐదుగురు ఏమ్మెల్యేలు హేమరామ్ చౌదరి, మురారీలాల్ మీనా, జహిదా ఖాన్, రాజేంద్ర సింగ్, బ్రిజేంద్ర ఓలాకు అశోక్ గహ్లోత్ కేబినేట్లో చోటు కల్పించారు.
ఆ ముగ్గురికి..
సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ మొత్తం శనివారం రాజీనామా చేసింది. అయితే వారిలో ముగ్గురిని మాత్రమే పక్కనపెట్టి మిగిలిన మంత్రులు ఆదివారం తిరిగి ప్రమాణం చేశారు. ఆ ముగ్గురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
రఘు శర్మను గుజరాత్ ఏఐసీసీ ఇంఛార్జ్‌గా, హరీశ్ చౌదరీని పంజాబ్ ఏఐసీసీగా, గోవింద్ సింగ్ దోతాస్రాను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రానున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పైలట్ వర్గానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్ఠానం ముందుగానే రాజస్థాన్‌లో చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Also Read: INS Visakhapatnam: నౌకాదళ విధుల్లో చేరిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'.. ఇక చైనాకు దడ తప్పదు!
Also Read: Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..