రాజస్థాన్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 15 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గహ్లోత్ సర్కార్‌కు ఇదే తొలి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ. ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేల జాబితాను రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా విడుదల చేశారు.
ఇందులో ముగ్గురు మంత్రులకు కేబినెట్ హోదా కల్పించనున్నట్లు తెలిపారు. కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నారు.
12 కొత్త ముఖాలు..
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ కోసం నిన్న సాయంత్రం గహ్లోత్‌కు కేబినెట్ మొత్తం రాజీనామాలు సమర్పించింది. ఇందులో ముగ్గురు కేబినెట్ మంత్రుల రాజీనామాలను సోనియా గాంధీ ఆమోదించారు. కొత్త కేబినెట్‌లో 12 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇందులో ఐదుగురు సచిన్ పైలట్ వర్గానికి చెందినవారు.
రాజీనామాలకు ముందు మొత్తం మంత్రుల సంఖ్య 21. సీఎం సహా గరిష్ఠంగా 30 మందిని కేబినెట్లోకి తీసుకునే వీలుంది.
కీలక పదవులు..
పాత కేబినెట్‌లో ముగ్గురికి కీలక పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రఘు శర్మను గుజరాత్ ఏఐసీసీ ఇంఛార్జ్‌గా, హరీశ్ చౌదరీని పంజాబ్ ఏఐసీసీగా, గోవింద్ సింగ్ దోతాస్రాను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రానున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పైలట్ వర్గానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్ఠానం ముందుగానే రాజస్థాన్‌లో చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..