దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదుకాగా 313 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,714 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,45,10,413
- మొత్తం మరణాలు: 4,65,662
- యాక్టివ్ కేసులు: 1,22,714
- కోలుకున్నవారు: 3,39,22,037
కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,39,09,708కి పెరిగింది. మరణాల సంఖ్య 4,65,662కు చేరింది. మరణాల శాతం 1.35గా ఉంది. రికవరీ రేటు 98.29%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.
గత 44 రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు 20 వేల కంటే తక్కువగా నమోదువుతున్నాయి. గత 147 రోజులుగా 50 వేల కంటే తక్కువగా ఉన్నాయి.
వ్యాక్సినేషన్..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,25,970 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,16,50,55,210కి చేరింది.
కేరళ..
కేరళలోను కరోనా కేసులు తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 60,385గా ఉంది. 6061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 248 మంది మృతి చెందారు.
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..