వివో వీ23ఈ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం లాంచ్ కానుంది. ఇప్పుడు ఈ ఫోన్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఈ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. ఇందులో 5జీ ఫీచర్‌ను కూడా అందించనున్నారు. వివో థాయ్‌ల్యాండ్ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కనిపించింది. ఇందులో 44 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఇందులో ప్రధాన కెమెరాగా అందించనున్నారు. దీని 4జీ వేరియంట్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


వివో వీ23ఈ 5జీ కలర్ ఆప్షన్లు, ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌కు సంబంధించిన వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వివో వీ2126 స్మార్ట్ ఫోన్ మల్టీపుల్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌ల్లో కనిపించింది. ఇదే వివో వీ23ఈ 5జీ అని తెలుస్తోంది. సింగిల్ కోర్ టెస్టింగ్‌లో ఈ ఫోన్ 471 నుంచి 558 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1,551 నుంచి 1,726 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది.


ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఈ ఫోన్ ఇటీవలే వివో థాయ్‌ల్యాండ్ వెబ్‌సైట్లో కనిపించింది. ఇందులో 44 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయి.


ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ గతంలో లాంచ్ అయిన వివో వీ23ఈ 4జీ తరహాలోనే ఉండనుంది. ఈ వారం ప్రారంభంలో టిప్‌స్టర్ సుధాంశు అంభోర్ దీనికి సంబంధించిన అధికారిక రెండర్లను షేర్ చేశారు. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆయన షేర్ చేశారు.


వివో వీ23ఈ 4జీ స్మార్ట్ ఫోన్ మూన్‌లైట్ షాడో, సన్‌షైన్ కోస్ట్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు లాంచ్ కానున్న 5జీ మోడల్లో ఎన్ని వేరియంట్లు ఉండనున్నాయో తెలియరాలేదు.


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి