షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. కంపెనీ లాంచ్ చేయనున్న తర్వాతి హైఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఎంఐ 11 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ గురించి షియోమీ ఎటువంటి వివరాలు తెలపలేదు.
షియోమీ 12 గురించిన వివరాలు మొదటిసారి ఆగస్టులోనే లీకయ్యాయి. షియోమీయూఐ వెబ్‌సైట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. షియోమీ రెండు కొత్త డివైస్‌లపై పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి లోకి, థోర్ అని కోడ్ నేమ్స్ ఉన్నాయి. ఇవే షియోమీ 12 అల్ట్రా, షియోమీ 12 అల్ట్రా ఎన్‌హేన్స్‌డ్ అని వార్తలు వస్తున్నాయి.
షియోమీ 12 అల్ట్రా, షియోమీ 12 అల్ట్రా ఎన్‌హేన్స్‌డ్ స్మార్ట్ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. షియోమీ 12 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్5 సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.
ఎంఐ 11 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. కథనాల ప్రకారం.. షియోమీ 12 అల్ట్రా కేవలం చైనాలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
2022 ద్వితీయ త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయా లేదా అనే విషయాన్ని షియోమీ తెలపలేదు. ఇక గతంలో లాంచ్ అయిన ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై ఓ లుక్కేస్తే.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.81 అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు కూడా 1.1 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఎంఐ 11 అల్ట్రా పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్2 సెన్సార్‌ను అందించారు, దీంతోపాటు మరో రెండు 48 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కాగా, మరొకటి టెలి మాక్రో సెన్సార్.వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 10W రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!