బిగ్ బాస్ సీజన్ 5 లో ఇప్పటి వరకూ పది మంది ఎలిమినేట్ కాగా ఇంకా హౌజ్ లో తొమ్మది మంది ఉన్నారు. వీరిలో రవి కెప్టెన్ కావడంతో మిగిలిన వారంతా నామినేషన్లలో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఇంకా నలుగురు ఎలిమినేట్ అవనుండగా మిగిలిన ఐదుగురు ఫైనల్స్ కి వెళతారు.దీంతో హౌజ్ లో టాస్కులు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఫైనల్ కి చేరేందుకు ఒకరికి అర్హత కల్పిస్తూ బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ ఆఫర్ చేశారు. ఈ పాస్ దక్కించుకున్న తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లిపోతారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. 






గార్డెన్ ఏరియాలో ఉన్న ఫైర్ ఇంజిన్లో రెండు సీట్లు ఉంటాయి. అలారం మోగిన వెంటనే ఎవరైతే ముందుగా వెళ్లి ఆ సీట్స్ లో వెళ్లి కూర్చుంటారో... వారి ఎదురుగా కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. ఫైర్ ఇంజిన్ లో కూర్చున్న ఇద్దరికి ఆ ఫొటోలను కాల్చే హక్కు ఉంటుంది. ఫైర్ ఇంజిన్లో కూర్చున్న వాళ్లని కన్విన్స్ చేసుకుని వాళ్లు తమ ఫొటోలు కాల్చకుండా ఉండేలా వాళ్లని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఎవరి ఫోటో అయితే చివరకి వరకూ కాల్చకుండా ఉంటుందో వారికి ఎవిక్షన్ పాస్ దక్కుతుంది. దాని ద్వారా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యి ఫైనల్ కి చేరుకుంటారు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. మరి ఫైనల్ గా ఎవరికి పాస్ దక్కుతుందో... టాప్ 5  కంటిస్టెంట్ ఎవరో చూడాలి. ఇక ఈ వారం  కెప్టెన్ గా మానస్ నిలిచినట్టు తెలుస్తోంది. ఇక నామినేట్ అయిన ఎనిమిది మందిలో కాజల్, యానీ మాస్టర్, ప్రియాంకకి ఓట్లు తక్కువ వచ్చాయని వీరీలో యానీ మాస్టర్ ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. 
Also Read:  అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: ఆహా... బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌'కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!
Also Read:  షన్నుకు సిరి లిప్ లాక్? వీళ్ల రిలేషన్ ఎక్కడికెళ్తోంది బిగ్‌బాస్? అసలు ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి