నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌ స్టాప‌బుల్‌' టాక్ షో తొలి ఎపిసోడ్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు లక్ష్మీ మంచు, విష్ణు మంచు వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని గెస్టుగా వచ్చారు. మరి, మూడు ఎపిసోడ్‌కు? మూడా... నాలుగా... అనేది పక్కన పెడితే, ఈ షోకి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్టుగా రానున్నారు. అవును... వెంకీని బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారు.

బాలకృష్ణ ఎంత సరదాగా ఉంటారనేది 'అన్‌ స్టాప‌బుల్‌' తొలి రెండు ఎపిసోడ్స్ చూపించాయి. హుషారుగా... అతిథులను నవ్విస్తూ, ఆడియ‌న్స్‌కు ఎంట‌ర్‌ టైన్‌మెంట్ అందిస్తూ ఆహా అనిపిస్తున్నారు. వెంకటేష్ కూడా చాలా సరదాగా ఉంటారు. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. వెంకటేష్ ఫిలాసఫీ మాట్లాడతారు. ఇద్దరూ కలిస్తే బోల్డన్ని సరదా సంగతులు బయటకు రావచ్చు. ఈ నెల 25న వెంకటేష్ నటించిన 'దృశ్యం 2' ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా సంగతులు కూడా షోలో వచ్చే అవకాశం ఉంది.
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
ఇక, సినిమాలకు వస్తే... బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' డిసెంబర్ 2న విడుదల కానుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన హ్యాట్రిక్ సినిమా ఇది. బాలకృష్ణ గెటప్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాకు బాలకృష్ణ కొబ్బరికాయ కొట్టారు. అందులో శ్రుతీ హాసన్ హీరోయిన్. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల బాలకృష్ణ చేతికి సర్జరీ జరిగింది. అయినా ఆయన 'అన్ స్టాపబుల్' షోకు బ్రేక్ ఇవ్వడం లేదు. సర్జరీ జరిగిన తర్వాత చేతికి కట్టుతో సినిమా ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యారు.


Also Read: టీనేజ‌ర్‌తో శ్రుతీ హాసన్ డేటింగ్ చేస్తారా? ఆ ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పారంటే...
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read: షన్నుకు సిరి లిప్ లాక్? వీళ్ల రిలేషన్ ఎక్కడికెళ్తోంది బిగ్‌బాస్? అసలు ఏం జరిగిందంటే..
Also Read: స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో... తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి