'ద ఘోస్ట్'... అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో హీరోయిన్ ఎవరు? ముందు కాజల్ అగర్వాల్‌. కొన్ని రోజులు ఆమె షూటింగులో పాల్గొన్నారు. సన్నివేశాలు తీశారు. ఆ తర్వాత  కరోనా సెకండ్ వేవ్ రావడం... కాజల్ గర్భవతి కావడంతో ఆమె స్థానంలో అమలా పాల్‌ను ఎంపిక చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఇప్పుడు 'ఘోస్ట్'లో అమలా పాల్ లేరు. ఎందుకు? అంటే... సాధారణంగా హీరోయిన్లకు ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో రూమ్ ఇస్తారు. ఆమె అసిస్టెంట్లకు త్రీ స్టార్ లేదంటే నార్మల్ హోటల్ రూమ్స్ ఇస్తారు. అయితే... స్టాఫ్‌కూ అమలా పాల్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్ ఇవ్వాలని కండీషన్స్ పెట్టిందని, ఇంకా బోలెడు డిమాండ్స్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ సన్నిహిత వర్గాల కథనం. ఆ డిమాండ్స్ భరించలేక ఆమెను సినిమా నుంచి తప్పించారని టాక్.


'ద ఘోస్ట్'లో ఓ లిప్ లాక్ సీన్ ఉందని, నాగార్జునతో ఆ సన్నివేశం చేయడం ఇష్టం లేక అమలా పాల్ తప్పుకొన్నారనేది మరో వెర్షన్. అయితే... లిప్ లాక్ సీన్ గురించి అమలాకు ముందు తెలుసు అనీ, డిమాండ్స్ భరించలేక నిర్మాతలు వద్దని చెప్పేసరికి ముద్దు సన్నివేశాన్ని సాకుగా చూపిస్తున్నారనేది ఇంకో వెర్షన్. కారణం ఏమైనా... సినిమాలో అమలా పాల్ లేరు. కొత్త హీరోయిన్ వేటలో టీమ్ ఉంది. త్వరలో ఎంపిక చేసి... షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

నాగార్జున మాజీ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్న ఈ సినిమాలో హింీ నటి గుల్ పనాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిఖా సురేం్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. ప్రవీణ్ సత్తారు తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఈ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారట.
Also Read: కర్నూలు కుర్రాళ్ల పాట సూడు... నాటు నాటు నాటు వీర నాటు!
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
Read Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి