RRR Song Mania: కర్నూలు కుర్రాళ్ల పాట సూడు... నాటు నాటు నాటు వీర నాటు!

'ఆర్ఆర్ఆర్' సాంగ్ మేనియా ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తోంది. 'నాటు నాటు...' పాటకు చాలా మంది డాన్స్ చేస్తున్నారు. లేటెస్టుగా కర్నూలు కుర్రాళ్లు కూడా చేశారు. Naatu Naatu Song

Continues below advertisement

'నాటు నాటు నాటు... వీర నాటు! ఊర నాటు!' - ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన డాన్స్ గురించి అంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు. పాట విడుదల కావడమే ఆలస్యం... ప్రేక్షకుల్లోకి అంతే నాటుగా వెళ్లింది. ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు అని లేదు. అందరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు పాట నచ్చింది. అంతే కాదు... చాలా మంది చేత ఈ పాట స్టెప్పులు వేయిస్తోంది. లేటెస్టుగా ఈ పాటకు కర్నూలు కుర్రాళ్లు... ఎన్టీఆర్ అభిమానులు డాన్స్ వేశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, రామ్ చరణ్ అభిమానులు... సాధారణ ప్రేక్షకులు ఈ పాటకు డాన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ సాంగ్‌కు 19 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కన్నడ పాటకు 4 మిలియన్ వ్యూస్, తమిళ పాటకు 3 మిలియన్ వ్యూస్, హిందీ పాటకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కవర్ సాంగ్స్ ఎంత మంది చేశారు? వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి? అనేది లెక్క లేదు. సుమారు 100 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయని చెప్పవచ్చు. అభిమానులు అయితే... 200 మిలియన్స్ రీచ్ అని చెబుతున్నారు.
Also Read: RRR నాటు మేనియా.. ధోనితో కూడా ‘నాటు’ స్టెప్పులు వేయించారు
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియ,  సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. 

Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
Read Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement