ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. వరుసగా సినిమాలో పాటలను రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా 'నాటు నాటు' సాంగ్ ను రిలీజ్ చేశారు. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో అందరూ కవర్ సాంగ్స్ చేస్తూ 'నాటు' సాంగ్ మ్యాజిక్ ను రీక్రియేట్ చేస్తున్నారు. ఆ కవర్ సాంగ్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..
RRR Naatu Naatu: RRR నాటు మేనియా.. ధోనితో కూడా ‘నాటు’ స్టెప్పులు వేయించారు
ABP Desam | 17 Nov 2021 06:10 PM (IST)
'నాటు నాటు' సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో అందరూ కవర్ సాంగ్స్ చేస్తూ 'నాటు' సాంగ్ మ్యాజిక్ ను రీక్రియేట్ చేస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' నాటు మేనియా