తెలుగబ్బాయి అయినప్పటికీ.. కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో విశాల్. ఆయన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. తెలుగులో విశాలే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. తమిళంతో సమానంగా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తుంటారు. రీసెంట్ గా ఈ హీరో నటించిన 'ఎనిమీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పునీత్ ను తలచుకొని ఎమోషనల్ అయ్యారు సూర్య. ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధత్యను తను తీసుకుంటానని అన్నారు.
తాజాగా మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విశాల్. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత్ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. పునీత్ తో తమకున్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ స్పీచ్ లు ఇచ్చారు. ఇదే సమయంలో విశాల్ కూడా మాట్లాడారు.
పునీత్ ను తలచుకుంటే నవ్వుతూ ఉండే ఆయన ముఖం తన కళ్ల ముందు మెదులుతోందని.. ఆయన మరణవార్త తెలియగానే కన్నీళ్లు ఆగలేదని, ఆ వార్తను జీర్ణించుకోవడానికి రెండు రోజుల సమయం పట్టిందని అన్నారు విశాల్. పునీత్ అన్ని సేవా కార్యక్రమాలు చేసేవారని.. ఆయన చనిపోయేవరకు కూడా ఎవరికీ తెలియదని.. అంత గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ విషయం తెలిసిన తరువాత ఆయన సేవాకార్యక్రమాల్లో తను కూడా భాగం కావాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
అందులో భాగంగా పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై తను చదివిస్తానని.. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు తనే భరిస్తానని చెపారు. ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు వరకు తనకు సొంతిల్లు అనేది లేదని.. తన తల్లిదండ్రులతోనే ఉంటున్నానని చెప్పారు విశాల్. తన సొంతింటి కల కోసం దాచుకున్న డబ్బుని పునీత్ కల కోసం వాడతానని చెప్పారు. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని అన్నారు.
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి