ఇప్పుడు హెల్ప్‌కు అర్థం మారిపోయింది. హెల్స్ అంటే సోనుసూద్ మాత్రమే. కరోనా వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే సోను సూద్.. పేదలకు సాయం చేసేవాడు. అయితే, కోవిడ్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల ఆయన సేవలు బయటపడ్డాయి. నగరాల్లో చిక్కుకుపోయిన పేద కూలీలను తిరిగి స్వస్థలాలకు పంపేందుకు సోను ప్రత్యేకంగా బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు సోను సూద్ విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తునే ఉన్నాడు. అడిగినవారికి కాదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో సమస్య చెబితే చాలు.. వెంటనే ‘‘హెల్స్ ఆన్ ది వే’’ అంటూ ధైర్యం నింపుతున్నాడు. ఇప్పుడు సోనుసోద్ అంటే సాయమే కాదు.. ‘ధైర్యం’ కూడా.
సోనుసూద్‌కు, తెలుగువారికి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చిత్రాల్లో విలన్‌గా సుపరిచితుడైన సోనుసోద్ టాలీవుడ్‌లో రాకముందే.. తెలుగువారితో బంధం ఏర్పడింది. 1996లో ఆయన మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సోనాలీ అనే యువతి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సోనూ సూద్ తన సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన తన మేనకోడలిని స్కూల్‌కు పంపేందుకు జడలు వేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఎవరైనా జడలు వేయించుకోవాలంటే తనని కలవాలని సోనుసోద్ తెలిపాడు.
తాజాగా పోస్ట్ చేసిన మరో వీడియోలో సోను సూద్ తన దాబాలో తయారు చేసే రోటీలు గురించి చెప్పాడు. ఈ సందర్భంగా తందూరీ నాన్ రోటీలను ఎలా తయారు చేస్తాడో చెప్పాడు. అంతేకాదు.. తానే స్వయంగా రోటీని తయారు చేసి చూపించాడు. తందూరీ నాన్ తయారు చేయాలంటే.. వంట చేసేవారికి చేతులు కాలతాయి. కానీ, రోటీ కావాలంటే.. కష్టపడక తప్పదు కదా అన్నాడు. తన డాబాలో అన్ని రకాల రోటీలు లభిస్తాయని, తప్పకుండా రుచి చూడాలని కోరాడు. అంతేకాదు.. పేదలు తన డాబాలో అన్ని రకాల రోటీలను ఉచితంగా రుచి చూడవచ్చని తెలిపాడు. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి.
Also Read: షన్నుతో ఆ ఫీలింగ్ తప్పని తెలిసినా చేస్తున్నా.. ప్రియాంక వీడియో చూసి మానస్ షాక్
Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..
Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా.. జనాలతో ఆడుకోకండ్రా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి