నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కూడా అన్నారు. అయితే తాజాగా కొందరు భాజపా నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. అవసరమైతే కొద్ది రోజుల తర్వాత సాగు చట్టాలను తిరిగి తీసుకురావొచ్చని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అన్నారు.
రాజస్థాన్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను పలువురు భాజపా నేతలు సమర్థించారు. ప్రభుత్వం కావాలనుకుంటే వాటిని తిరిగి తీసుకురావొచ్చన్నారు.
[quote author=సాక్షి మహారాజ్, భాజపా ఎంపీ]ఈ సాగు చట్టాల రద్దుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. మోదీకి దేశమే ముఖ్యం. మళ్లీ ఇవి పార్లమెంటుకు వస్తాయి రద్దు చేస్తారు. కావాలనుకుంటే మళ్లీ రీడ్రాఫ్ట్ చేసి చట్టాలుగా మారుస్తారు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. [/quot
రైతులకు క్షమాపణలు..
దాదాపు ఏడాదిగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే వీటిపై వెనక్కి తగ్గేదే లేదని పలుమార్లు చెప్పిన మోదీ సర్కార్ ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..