మారుతి సుజుకి మళ్లీ కొత్త కార్లను వరుస పెట్టి లాంచ్ చేస్తుంది. కొత్త సెలెరియో కారును కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి ప్రస్తుతం ఎన్నో మోడల్స్‌ను రూపొందిస్తోంది. వీటిలో ఒకటి కొత్త విటారా బ్రెజా. ప్రస్తుతం ఎన్నో సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్న పాత వెర్షన్‌ను ఈ కొత్త మోడల్‌లో రీప్లేస్ చేయనున్నారు.


ఈ కొత్త విటారా బ్రెజాను సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. సైజ్ పరంగా చూసుకుంటే.. గతంలో వచ్చిన విటారా కంటే ఇది ఎంతో పెద్దది. డిజైన్ కూడా కొత్తగా ఉంది. కొత్త స్లిమ్మర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, క్రోమ్ గ్రిల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంది.


కారు పక్కభాగంలో మందమైన బ్లాక్ క్లాడింగ్‌ను అందించారు. కొత్తగా 16 అంగుళాల అల్లోయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వెనకభాగంలో సన్నని టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. దీని డిటైలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న విటారా బ్రెజా కంటే ప్రీమియం లుక్‌ను కొత్త బ్రెజాలో అందించనున్నారు.


అన్నిటికంటే పెద్ద మార్పు ఇంటీరియర్‌లో ఇచ్చారు. కారు ఇంటీరియర్ పూర్తిగా మారిపోనుంది. కొత్త ఫ్లోటింగ్ తరహా టచ్ స్క్రీన్ ఇందులో ఉండనుంది. కొత్త స్టీరింగ్ వీల్, మార్పులు చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. స్క్రీన్ సైజు పెద్దది అయినా కస్టర్ పూర్తిగా డిజిటల్ కాదు.


ఎయిర్ వెంట్స్‌ను కారు కింది భాగంలో అందించారు. చూడటానికి లగ్జరీ కారు తరహాలో ఇది ఉంది. వెనకవైపు ఏసీ వెంట్లు, సన్‌రూఫ్, 360 డిగ్రీ రేర్ వ్యూ కెమెరా, పవర్ ఓఆర్‌వీఎంలు కూడా ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లో 6-స్పీడ్ ప్యాడిల్ షిఫ్టర్లను అందించారు.


1.5 లీటర్ పెట్రోల్ మోటార్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. డీజిల్ వేరియంట్ మాత్రం అస్సలు అందుబాటులో లేదు. ఈ కారు మనదేశంలో 2022 ద్వితీయార్థంలో లాంచ్ కానుంది.


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి