హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రోసీడ్ ఇండియా ఇన్వెస్టర్లకు డబ్బుల పంట పండించింది! కేవలం ఆరు నెలల్లోనే 26,122 శాతం రాబడి ఇచ్చింది. 2020, మే 19న కేవలం 36 పైసలుగా ఉన్న ఈ పెన్నీ స్టాక్ ఈ ఏడాది నవంబర్ 18న బీఎస్‌ఈలో రూ.94.40కు చేరుకుంది. అంటే ఆరు నెలల కిందట ఈ స్టాకులో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.2.62 కోట్లు మీ చేతికి అందేవి. ఇదే సమయంలో సెన్సెక్స్ 19.50 శాతం పెరగడం గమనార్హం.
గురువారం రూ.99.35గా ఉన్న ప్రోసీడ్ ఇండియా షేరు ధర 4.98 శాతం తగ్గి రూ.94.40 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో ఈ స్టాక్ 18.48 శాతం నష్టపోయింది. నవంబర్ 18న 4.98 శాతం గ్యాప్‌డౌన్‌తో ఓపెనైంది. ప్రస్తుతం 100, 200 రోజులు మూవింగ్ యావరేజెస్ పైనే ఉన్న స్టాక్ 50, 20, 5 రోజుల మూవింగ్ యావరేఎస్‌కు దిగువన కదలాడుతోంది.
ఏడాది కాలంలో 24,742 శాతం ర్యాలీ చేసిన ఈ స్టాక్ జీవిత కాలంలో 31,366 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. షేరు ధర ఇంతలా రాణిస్తున్నా కంపెనీ ఆర్థిక అంశాలు మాత్రం అంత మెరుగ్గా లేవు. గత 11 త్రైమాసికాల్లో అసలు విక్రయాలే లేవు. రానురాను నష్టాలు పెరుగుతున్నాయి. మొత్తంగా 23,176 మంది వద్ద 30.95 లక్షల షేర్లు ఉన్నాయి. ప్రమోటర్ల వద్ద 97 శాతం, ప్రజల వద్ద 3 శాతం షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల పెరుగుదల అనుమానాలకు తావిస్తోంది!
నోట్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమేనని గమనించగలరు. మీరైదేనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణులను సంప్రదించి, పూర్తిగా అవగాహన వచ్చాకే చేయండి.
Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!
Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి