'జీవితం అంటే గమ్యం కాదు.. అదో ప్రయాణం' ఎంతో మంది మేధావులు చెప్పిన మాట ఇది! కేరళకు చెందిన కేఆర్‌ విజయన్‌, మోహన దంపతులు దీనిని తు.చా. తప్పకుండా పాటించారు. ఇద్దరు కూమార్తెల పెళ్లిళ్లు చేసిన తర్వాత ప్రపంచ అన్వేషణకు బయల్దేరారు. అతి తక్కువ సమయంలోనే 26 దేశాలు చుట్టొచ్చారు. వారు స్వతహాగా కోటీశ్వరులేమీ కాదు! కోచిలో ఓ టీకొట్టు నడుపుకుంటారు. రెండేళ్ల క్రితం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ దంపతులు ఎంతోమందికి ప్రేరణనిచ్చారు. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం వారికి అభిమానే.


ఆ వృద్ధ దంపతుల్లో ఒకరైన విజయన్‌ శుక్రవారం మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 71 ఏళ్లు. గుండెపోటు రావడంతో ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన కన్ను మూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్‌ మహీంద్రా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మనందరిలోని అన్వేషకులను తట్టిలేపారని పేర్కొన్నారు. వారు చేసిన ఓ పర్యటనలో తానూ ఓ భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.


కోచిలో విజయన్, మోహన దంపతులు టీకొట్టు నడుపుతారు. వారిద్దరి కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. 50 ఏళ్ల వయసు తర్వాత వారు విదేశాలు తిరిగి రావడం మొదలుపెట్టారు. ఏకంగా 26 దేశాలు తిరిగొచ్చారు. మొదట్లో విదేశాలకు వెళ్లేందుకు బ్యాంకుల వద్ద రుణం తీసుకొనేవారు. మళ్లీ టీకొట్టులో సంపాదించి వాటిని తీర్చేవారు. ప్రయాణాల కోసం ఆయన రోజుకు రూ.300 పక్కనపెట్టేవారని తెలిసింది. రెండేళ్ల క్రితం వీరి గురించి మీడియాకు, బయట ప్రపంచానికి తెలిసింది. అప్పట్నుంచి కొందరు వీరి యాత్రలకు స్పాన్సర్‌ చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఈ దంపతులు రష్యాకు వెళ్లొచ్చారు. ఇంతలోనే ఇలా జరిగింది..!






Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!


Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!


Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు


Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది


Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి