పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బడాభాయ్ అని పిలవడం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీన్ని భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ దాడిని కూడా సిద్ధు తన స్టైల్‌లో తిప్పి కొట్టారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఓ ఘటన చోటు చేసుకుంది. అక్కడ షూట్ చేసిన ఓ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బడా భాయ్ అంటూ సంబోధించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. విపక్షాలు సిద్ధ కామెంట్స్‌ను తీవ్ర స్థాయిలో తప్పు బడుతున్నాయి. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జాతికి క్షమాపణ చెప్పాలని పట్టుబడుతోంది.
బీజేపీవాళ్లు చేస్తున్న విమర్శలపై సిద్ధు తన స్టైల్‌లో స్పందించారు. బీజేపీ వాళ్లు సంతోపడినట్టుగాన మాట్లాడుకోనివ్వండీ అంటూ సెటైర్‌లు వేశారు.
బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ మాల్వియా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను “బడా భాయ్” అని పిలిచారని తన పోస్టులో రాసుకొచ్చారు. చివరిసారి అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకున్నప్పుడు... అనుభవజ్ఞుడైన అమరీందర్ సింగ్‌ను కాదని సిద్ధూకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఏంటని ఆశ్చర్య వ్యక్తం చేశార.
బీజేపీ విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరపున సిద్ధూకు స్వాగతం పలుకుతున్న టైంలో సిద్ధూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. “మేరా బడా భాయ్ హై.. ఉస్నే బోహోత్ ప్యార్ దియా హై ముజే అంటే అతను నా అన్నయ్య.. నాకు చాలా ప్రేమను ఇచ్చాడు చెప్తూ సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ట్వీట్ చేసింది.
బీజేపీ లీడర్ విడుదల చేసిన వీడియో కాస్త వైరల్ కావడంతో పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ బిజెపిపై ఎదురుదాడికి దిగారు. “ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లినప్పుడు అతను 'దేశ్ ప్రేమికుడని... సిద్ధూ వెళ్ళినప్పుడు 'దేశ్ ద్రోహి ఎలా అవుతారని నిలదీశారు. గురునానక్ ఫిలాసఫీని అనుసరించే తాము అలా మాట్లాడలేమన్నారు పర్గత్ సింగ్.
పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో బీజేపీతో జతకట్టేందుకు యత్నిస్తున్న పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సిద్ధూపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను దేశ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు అమరీందర్. సిద్ధూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా, పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌లతో స్నేహం చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తిని పంజాబ్ ముఖ్యమంత్రిగా నేను మాత్రం అంగీకరించబోనని అమరీందర్ కామెంట్ చేశారు.
వస్తున్న విమర్శలపై మీడియాతో మాట్లాడిన సిద్ధు.. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ తిరిగి ప్రారంభించిన ఘతన ఇరు దేశాల ప్రధానమంత్రులకు దక్కుతుందన్నారు. వాళ్లిద్దరి కృషి కారణంగానే ఆ రహదారి తెరుచుకుందన్నారు. పంజాబ్ భవిష్యత్‌ను మార్చాలని కేంద్రం అనుకుంటే సరిహద్దురు ఓపెన్ చేయాలని కోరతానన్నారు సిద్ధు. మొత్తం 2100 కిలోమీటర్లు ఉన్న ముంద్రా పోర్ట్ గుండా ఎందుకు వస్తువులు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేయాలి.. పంజాబ్ సరిహద్దులు ఓపెన్ చేస్తే కేవలం 21కిలోమీటర్లు ప్రయాణితే పాకిస్థాన్ చేరుకోవచ్చన్నారు