క్రూయిజ్ షిప్ కేసులో డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ సేథ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బాంబే హైకోర్టు శనివారం (నవంబర్ 20) ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో పూర్తి వివరాలు పొందుపరిచింది. ఈ ముగ్గురు ఏదైనా నేరపూరిత కుట్ర పన్నినట్టు నిర్దారించడానికి రికార్డుల్లో ఎలాంటి ఆధారాల్లేవని తేల్చింది.
"దరఖాస్తుదారులు నేరం చేయడానికి కుట్ర పన్నారని ఊహించడానికి రికార్డులో ఎటువంటి మెటీరియల్ లేదు. ఈ దశలో, దరఖాస్తుదారులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఊహించడం చాలా కష్టం" అని బెయిల్ ఆర్డర్‌లో బాంబే హైకోర్టు పేర్కొంది.
Also Read: ‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది.. ఈ లిస్ట్‌లో ఉన్నవి వాడితే వెంటనే మార్చాల్సిందే!
ఉద్దేశ పూరకంగానే ఈ పని చేసినందున ఎన్‌డిపిఎస్ చట్టం కింద ఆర్యన్ ఖాన్ సహా మిగిలిన ఇద్దర్ని నేరస్తులుగా పరిగణించి బెయిల్ తిరస్కరించాలన్న ప్రతివాది చేసిన వాదనను బాంబే హైకోర్టు తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది.
Also Read: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
ముంబై నుంచి గోవా వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెయిడ్ చేశారు. ఆ పార్టీలో దొరికిన వారిని అరెస్ట్ చేశారు. షారుఖ్ కుమారుడితో పాటు మరో ఇద్దర్ని జైలుకు పంపించారు. హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడినప్పటి నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్యన్‌పై అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆరోపణలను ఎన్‌సీబీ అధికారులు చేశారు. ఆయనతో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయన్న కారణంగా హీరోయిన్ అనన్యపాండేను కూడా ప్రశ్నించారు. వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా మీడియాకు లీక్ చేశారు. అదే సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమీర్ వాంఖడేపై ఆరోపణలు వెల్లువెత్తాయి.