మెర్సిడెస్ మనదేశంలో తన హై పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బాక్ కారును లాంచ్ చేసింది. అదే మెర్సిడెస్ బెంజ్ ఏ45ఎస్ 4మాటిక్+. దీని ధర మనదేశంలో రూ.79.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న 13వ ఏఎంజీ ఇదే.
హ్యాండ్ మేడ్ 2.0 లీటర్ పెట్రోల్, 4 సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. 431 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ ఇదే. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకన్లలోనే అందుకోగల సామర్థ్యం ఉంది.
ఏఎంజీ యాక్టివ్ రైడ్ కంట్రోల్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్ 4మాటిక్ ప్లస్ ఆల్ వీల్ డ్రైవ్ ఏఎంపీ టార్క్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇందులో డెడికేటెడ్ డ్రిఫ్ట్ మోడ్‌ను కూడా అందించారు. ‘స్లిప్పరీ’, ‘కంఫర్ట్’, ‘స్పోర్ట్’, ‘స్పోర్ట్+’, ‘ఇండివిడ్యువల్’, ‘రేస్’ మోడ్స్‌ను ఇందులో అందించారు. దీని టాప్ స్పీడ్ గంటలకు 270 కిలోమీటర్లుగా ఉండటం విశేషం.
ఇక లుక్ విషయానికి వస్తే.. ఇందులో ట్విన్ రౌండ్ టెయిల్ పైపులు అందించారు. పెద్ద చక్రాలు, స్పోర్టియర్ స్టాన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సన్ ఎల్లో, పోలార్ వైట్, మౌంటెయిన్ గ్రే, డిజిగ్నో పస్టాగోనియా రెడ్, డిజిగ్నో మౌంటెయిన్ గ్రే మాగ్నో, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉండనుంది.
కారు లోపల స్పోర్ట్స్ సీట్స్ అందించారు. హెడ్స్ అప్ డిస్‌ప్లే, 12 స్పీకర్ బర్మస్టర్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. మొత్తంగా చూసుకుంటే మెర్సిడెస్ లాంచ్ చేసిన పవర్‌ఫుల్ కార్లలో ఇది కూడా నిలవనున్నట్లు చెప్పవచ్చు.
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!