ఈ రోజుల్లో పాన్ అన్నిటికీ అవసరంగా మారిపోయింది. చిన్న ఆర్థిక లావాదేవీ చేపట్టాలన్నా పర్మనెంట్ అకౌంట్ నంబర్ అడుగుతున్నారు. బిల్లుల చెల్లింపు, పన్ను దాఖలు, బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక ఖాతాలు తెరిచేందుకు ఇలా అన్నింటికీ పాన్ డాక్యుమెంట్ ముఖ్యమే.
ఒకప్పుడు పాన్ నంబర్ కావాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. డిజిటైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు సులభంగా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంటి దగ్గర్నుంచే ఆన్‌లైన్‌లో పది నిమిషాల్లోనే తేలికగా చేసుకోవచ్చు. రెండు పేజీల ఫామ్‌ను నింపే బదులు ఆధార్ ఈ-కేవైసీ ఉపయోగించి ప్రక్రియ ముగించొచ్చు.
ఇలా చేయాలి
- మొదట ఆదాయ పన్నుకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- ఇన్‌స్టాంట్ పాన్ కోసం ఆధార్ సెక్షన్‌లో క్విక్ లింక్స్‌ను క్లిక్ చేయాలి.
- 'గెట్ న్యూ పాన్'పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాలి.
- మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- ఈ-మెయిల్‌ను అథంటికేట్ చేసి ఐడీని సృష్టించాలి.
- అప్పుడు ఆధార్ ఈ-కేవైసీ ద్వారా వెంటనే మీ పాన్ సంఖ్య వచ్చేస్తుంది.
- ఆ తర్వాత పాన్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఈ ప్రక్రియ కోసం రూ.50 చెల్లించాల్సి వస్తుంది.
Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి
Also Read: Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి