బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టారు. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. సహచరుడు అనిల్ కుంబ్లే నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌లే ప్రకటించారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ లేనంత వరకు దాదా ఇటు బీసీసీఐ, అటు ఐసీసీలో కీలకంగా ఉంటారు.
తొమ్మిదేళ్లుగా అనిల్ కుంబ్లే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మూడుసార్లు మూడేళ్ల పదవీకాలం పనిచేశారు. నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్) ప్రవేశపెట్టడం, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫార్మాట్, ఇతర టెక్నికల్ అంశాల్లో అభివృద్ధికి కుంబ్లే కృషి చేశారు. ఆటగాడు, కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించిన గంగూలీ ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత బీసీసీఐలో అత్యున్నత పదవిని చేపట్టారు.
'ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న గంగూలీకి స్వాగతం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు, అతిపెద్ద బోర్డు పాలకుడిగా అతడి అనుభవం మేం విలువైన నిర్ణయాలు తీసుకొనేందుకు ఉపయోగపడుతుంది. తొమ్మిదేళ్లుగా కమిటీని నడిపించిన కుంబ్లే నాయకత్వానికి ధన్యవాదాలు. డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టడం, అనుమానిత బౌలింగ్ శైలి నిర్ధారణ ప్రక్రియల్లో ఆయనెంతో బాగా పనిచేశారు' అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌లే అన్నారు.
Also Read: IND vs NZ: మరో చరిత్రకు నాంది! కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొదటి సిరీస్.. కివీస్‌తో నేడే ఢీ!
Also Read: IND vs NZ: టీమ్‌ఇండియాతో టీ20 సిరీసుకు కేన్ విలియమ్సన్ దూరం.. కెప్టెన్ ఎవరంటే!
Also Read: Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి